ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క సీటు గెలవకుండా చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు ఈ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుకుని ఆ పార్టీకి నాలుగు సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ సొంతంగా 66 స్థానాల్లో పోటీ చేయగా వాటిలో 3 మినహాయించి 63 చోట్ల డిపాజిట్లని కోల్పోయింది. వరుసగా మూడు సార్లు ఢిల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పార్టీకి ఇంతఘోరంగా ఒడిపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

 

 

అయితే కాంగ్రెస్ ఓడినప్పటి నుండి సొంత పార్టీ నాయకులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బయట వారు ఇప్పటికే ఎన్నో రకాలుగా విమర్శించారు. ఇప్పుడు సొంత నాయకులు సైతం పార్టీ నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఇంతలా పతనం కావడానికి కారణం మీరంటే మీరని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా అధఃపాతాళంలోకి పడేస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితిపై స్పందించిన ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ నటి ఖుష్బూ ఈ విధంగా స్పందించింది.

 

 


ఇప్పటికైనా మేల్కొందాం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఆశించనప్పటికీ.. ఇంత దారుణంగా ఓడిపోతామని మాత్రం కలలో కూడా అనేకోలేదని, అసలు పార్టీ పనిచేస్తుందా? లేదా? సరైన దారిలో వెళుతున్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని పరిస్థితుల్ని చక్కబెట్టుకుందామంటూ ఖుష్బూ సూచించారు. ఇక సీనియర్ నాయకులు విమర్శలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

 

 

ఇదంతా చూస్తుంటే అసలే చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపుతున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఇలా కావడానికి తన వంతు పాత్ర కూడా ఉందని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ తెలిపింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొని నాయకత్వాన్ని మెరుగుపర్చుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: