డబ్బు సంపాదించడానికి ఏ వ్యక్తికి అయినా ముందుగా అవసరం అయ్యేది సంపన్న మనస్తత్వం. పేదవాడు అనే భావనను మనసు పోరలలోంచి తోలిగించుకోనంతకాలం ఏవ్యక్తి సంపద సృష్టించలేడు. ఒకవేళ సంపదను సృష్టించినా దానిని కాపాడుకోలేడు.


ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ తాను స్థాపించిన ‘బచన్ కార్పోరేషన్’ పేరుతో సినిమాలు తీసి కొన్ని కోట్ల రూపాయలను కోల్పోవడమే కాకుండా తన సొంత ఇంటిని తాకట్టు పెట్టుకోవలసిన పరిస్థితికి ఒకదశలో వెళ్ళిపోయాడు. అయితే గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఆర్ధికంగా మళ్ళీ నిలబడ్డ అమితాబ్ ను ఇలా మళ్ళీ ఎదగడం వెనుక కారణం ఏమిటి అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ తన ఇంటర్యూలో ప్రశ్నించినప్పుడు ‘నేను డబ్బును మాత్రమే కోల్పోయాను డబ్బు సంపాదనకు అవసరమైన మనస్తత్వాన్ని కోల్పోలేదు’ అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.


మనం మనసు లోతులలో దేనిని అయితే గట్టిగా నమ్ముతామో అదే చివరికి జరిగి తీరుతుందని అనేక మంది మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెపుతూ ఉంటారు. ఒక వ్యక్తి తాను ధనవంతుడు కాలేనని అన్న ఆలోచనలలో ఉంటే అతడు ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. అంతేకాదు ఏ వ్యక్తి అయినా తన పేదరికాన్ని పదేపదే తలుచుకుంటూ కుములిపోతూ ఉంటే ఆ బావ దారిద్ర్యంతోనే జీవితం ముగిసి పోతుంది కాని ఎట్టి పరిస్థితులలోను ఆ వ్యక్తి ధనవంతుడు కాలేడు.


చాలామంది మన నమ్మకాలు ప్రవర్తన చేతల మూలంగా పేదవాళ్ళు గా మిగిలి పోతారు కాని ఏ వ్యక్తిని పేదవాడిగా జీవించమని భగవంతుడు ఆదేశించలేదు అంటూ వేదాంతులు చెపుతారు. వాస్తవానికి ఒక వ్యక్తి ధనవంతుడుగా మారాలి అంటే ఆ వ్యక్తి తనలోని అంతర ప్రపంచం గురించి తెలుసుకోవాలి. కంటికి కనపడే బాహ్య ప్రపంచం కన్నా మనలోని అంతర ప్రపంచం చాల శక్తివంతమైనది. ఈ అంతర ప్రపంచం గురించి తెలుసుకోగలిగిన వ్యక్తికి మాత్రమే తనలోని శక్తియుక్తులు తెలుసుకుని అతడు సంపన్నుడు గా మారగలడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: