రంగమేదైన, నేపథ్యమేదైనా వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా ప్రతీ ఒక్కరిలో ఉండే కామన్‌ ఎమోషన్‌ ప్రేమ. అవును ప్రేమలో పడని మనిషి ఉండరన్నది అక్షర సత్యం. పురాణ కాలం నుంచి ఉన్న ప్రేమకథలు మన ముందు జనరేషన్లలో కూడా చాలానే కనిపిస్తాయి. ఇక సెలబ్రిటీలుగా ఉన్నవారి ప్రేమకథలైతే చాలా మందికి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తుంటాయి.

 

అలాంటి ఓ అందమైన ప్రేమకథే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కది. ఆయన సతీమణి నార్త్‌ ఇండియన్‌. గుజరాతి అయిన ఆమెను ప్రేమించి పెళ్లాడారు భట్టి విక్రమార్క. తన ప్రేమకథ గురించి చెప్పిన భట్టి ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరు ప్రేమికులే అన్నారు. ప్రతీ ఒక్కరు ప్రేమకోసమే తపిస్తుంటారు. అయితే వారి ప్రేమ ఒక్కొక్కరికీ ఒక్కో అంశం మీద ఉంటుందన్నారు. 

 

30 ఏళ్ల వయసులో భట్టి ప్రేమలో పడ్డారు. హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన గుజరాతీ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెను యునివర్సిటీలో చదువుతున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదువుతుండగా అదే యూనివర్సిటీలో అడ్మిషన్‌ కోసం వచ్చిన నందిని గారితో ఆయన ప్రేమలో పడ్డారు. అయితే తరువాత నందినిగారు యూనివర్సిటీలో జాయిన్‌ కాకపోయినా ఆ రోజు ఏర్పడిన పరిచయం కొనసాగి ప్రేమగా మారింది.

 

అయితే తన ప్రేమ కథలో బయట కలుసుకోవటం, మాట్లాడుకోవటం, పార్కుల వెంట తిరగటం లాంటివేవి లేవన్నారు భట్టి. అయతే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నామన్నారు భట్టి. అయతే తొలి చూపులో కలిగిన తన ప్రేమ ఇన్‌ఫ్యాక్య్చువేషన్‌ కాదన్న భట్టి అందుకే ఇప్పటికీ తన ప్రేమ పెరుగుతూనే ఉందన్నారు. మల్లు భట్టివిక్రమార్క, నందిని గార్లకు ఇద్దరు సంతానం. ప్రేమ పెళ్లి చేసుకున్న భట్టి ఆయన కుమారులు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని కూడా సమర్థిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: