ప్రపంచంలో అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో చెప్పుకోదగ్గ దేశం చైనా అని చెప్పవచ్చూ . ఆర్దికంగా గాని, టెక్నాలజీ పరంగా గానీ ఇలా ఏ రంగంలో తీసుకున్న చైనా ముందంజలో ఉంది. ఇక ఇప్పుడు మరణాల సంఖ్యలో కూడా ముందంజలోనే ఉంది. అలాగే అబద్దాలు ఆడటంలో కూడా మొదటి స్దానంలో నిలిచింది. ఇలా ఎందుకు అనవలసి వచ్చిందంటే.  చైనాలో విసృతంగా ప్రభలుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయలేకపోతున్న చైనా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది...

 

 

అంతే కాకుండా అక్కడ ఎంతమందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు ఎందరు మరణించారు అనే విషయాలను కూడా చాలా గోప్యంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది.. ఇలా చైనా తనదేశంలో ఇంతగా దారుణమైన మరణాలు జరుగుతున్న ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఇదే కాకుండా ఈ వ్యాధి తీవ్రతకు సంబంధించిన ఏ విషయాన్ని బయట పెట్టలేదు.. ఇప్పటికే అక్కడ కరోనా  రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.  ఇలా పెరిగిపోవడం కాస్త ఆందోళన చెందవలసిన విషయమే. ఇక ఈ విషయాంలో చైనా ప్రభుత్వం ఎంతగానో అప్రమత్తం అయ్యి తగిన చర్యలు తీసుకుంటుంది.

 

 

అయినా గాని నిన్న ఒక్కరోజులోనే 242 మంది కరోనా వ్యాధి గ్రస్తులు మరణించడంతో చైనాతో పాటుగా ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. అంతే కాకుండా మరో 15,000 కొత్త కేసులు నమోదయినట్టు చైనా అధికారులు తెలిపారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,355కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య 60,000 దాటినట్టు హుబే హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ ప్రావిన్సుల్లో కొత్తగా 14,840 మంది బాధితులను గుర్తించనట్టు తెలిపారు. ఇప్పటి వరకు పదుల్లోనే ఉన్న మృతుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపు కావడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

ఇకపోతే ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి విషయంలో తప్పుడు లెక్కలు చెప్తూ వచ్చిన చైనా ఇప్పుడు  ఆ సంఖ్యను భారీగా పెంచడంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.  అసలు చైనాలో నిజంగా ఏం జరుగుతున్నదో తెలియక భయపడుతున్నారు. అంటే ఇన్నాళ్లూ ప్రపంచాన్ని మోసం చేస్తూ చైనా దాచిన ఈ భయంకరమైన చావుల నిజాలు బయటకు వస్తుంటే, ఇలాంటి విషయంలో కూడా చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది అనుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: