శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతున్న వాలంటైన్స్ డే కి కరొనా వైరస్ దెబ్బ బాగానే పడినట్లుంది. మామూలుగా ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డేని బ్రహ్మాండంగా జరుపుకునేందుకు ప్రేమికులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, దంపతులు కూడా ప్రపంచంలోని తమకు నచ్చిన దేశాల్లో హాలిడే ట్రిప్సుకు రెడీ అయిపోతారు. కానీ ఈసారి మాత్రం అటువంటి వాతావరణం చాలా వరకూ తగ్గిపోయిందని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం కరొనా వైరస్ ప్రపంచదేశాలను వణికించేస్తుండటమే.

 

చైనాలో మొదలైన ప్రాణాంతక  కరొనా వైరస్ చాలా దేశాలకు పాకిపోయింది. వైద్య నిపుణులు చేప్పేదాని ప్రకారమైతే సుమారు 20 దేశాలకు   ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. హాంకాంగ్ లోని ఓ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వీలైనంత తొందరలో కరొనా వైరస్ ను అరికట్టకపోతే ప్రపంచం మొత్తం మీద సుమారు 400 కోట్లమంది చనిపోయే ప్రమాదముందని చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది.

 

ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం చైనాలో కొన్ని వేలమంది చనిపోయారు. కాకపోతే మృతుల సంఖ్యను ఉన్నదున్నట్లుగా చెబితే ప్రజల్లో ఎక్కడ భయాందోళనలు పెరిగిపోతాయో అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రభుత్వం కూడా వాస్తవాలను చెప్పదు. ఇపుడు ప్రపంచంలోని దేశాలు కూడా అదే పనిచేస్తున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే శుక్రవారం రాబోతున్న వాలంటైన్స్ డే ని బహిరంగ ప్రాంతాల్లో జరుపుకోకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  జలుబు, దగ్గు ద్వారా ఒకరినుండి మరొకరికి వ్యాపించే కరొనా వ్యాధిని అరికట్టాలంటే ముందు వ్యక్తులుగా ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఇందులో భాగంగానే  వాలంటైన్స్ వేడుకలను నిషేధించటమే మేలని సూచిస్తున్నారు. ప్రేమికులు, దంపతులు ముద్దు ముచ్చట్లకు ఈసారి దూరంగా ఉంటేనే అందరికీ మంచిదని కూడా కొందరు డాక్టర్లు ఓ అడుగు ముందుకేసి మరీ హెచ్చరిస్తున్నారు. మరి ప్రేమికులు వింటారా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: