చైనా దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే వెయ్యి మందిని పైగా అతి కిరాతకంగా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా చంపేసింది. అలాగే 50 వేల మందికి ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి.. చైనీయుల మరణాల సంఖ్యను రోజురోజుకు పెంచుతూ పోతోంది. ఇటువంటి భయంకరమైన వైరస్ కు ఎటువంటి చికిత్స చేయాలో తెలియక చైనా ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం తమ సుప్రీంకోర్టును ఆశ్రయించి వ్యాధి సోకిన వారినందరిని చంపేస్తామని కోరినట్లు మధ్య కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి.

 

మళ్లీ తాజాగా సుప్రీంకోర్టు కరోనా సోకిన వ్యాధిగ్రస్తులను హతమార్చేందుకు ఆదేశాలను ఇచ్చిందని నెట్టింట ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వ్యాఖ్యలను బలపరిచే విధంగా ఒక వీడియో అంతర్జాలంలో దర్శనమై అనేక మంది చైనీస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే... మాస్కులు ధరించిన ముగ్గురు పోలీసులు వైరస్ సోకిన పేషంట్లను నడిరోడ్డుపై పడుకో పెట్టి వారి మెడలో కాల్చుతారు. తరువాత ఆ వీడియోలో ఒక పేషంట్ చనిపోయి ఫుట్ పాత్ పై పడి ఉన్నట్టు కనిపించగా... తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నట్లు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోంది.

 

అయితే ఇది నిజంగా నిజమేనా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మాస్కులు ధరించిన పోలీసులకు సంబంధించిన ఒక ఒరిజినల్ వీడియోని కొంతమంది ట్విట్టర్ యూజర్లు నెట్టింట షేర్ చేసి నిజాన్ని బయటపెట్టారు. అసలు ఆ ఒరిజినల్ వీడియోలో చైనీస్ పోలీసులు కేవలం గన్నులు పట్టుకొని అటు ఇటు తిరిగి తమ వాహనాన్ని మాత్రమే ఎక్కుతారు. అంతే తప్ప మిగతా పనులు ఏమి చేయరు. అయితే ఈ వీడియో మధ్యలో కొత్తగా కనిపించిన దృశ్యాలు ఏంటంటే ఒక బైక్ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో క్లిప్ అని తెలిసింది. కొంతమంది ఆగంతకులు ఆ వైరల్ వీడియో మధ్యలో ఆక్సిడెంట్ దృశాలను సక్రమంగా కుదిర్చి... చైనీస్ పోలీసులు అతడిని చంపినట్లు క్రియేట్ చేశారు. కానీ కొంతమంది ఈ వీడియో గురించి నిజం చెప్పేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని చేయవద్దని కోరుతున్నారు. 

twitter.com/IndurChhugani/status/1227267984445456386

 

మరింత సమాచారం తెలుసుకోండి: