కర్ణాటక రాష్ట్రంలోని పరిశ్రమలు, సంస్థల్లోవ్ కన్నడిగులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ 113కు పైగా సంఘాలు, సంస్థల పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. డాక్టర్‌ సరోజిని మహిషి నాలుగు దశాబ్దాల కిందట ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలంటూ కన్నడ సంఘాలు, సంస్థల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్‌ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీంతో ఉదయం నుంచి వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి.

 

వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంగుళూరులోని ఫరంగిపేట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకశాఖ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పర్యాటక శాఖ బస్సు తిరుపతి నుంచి మంగుళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్యాబ్‌లు, ఆటోలు, హోటళ్ల సంఘాల్లో కొందరు బంద్‌కు మద్దతుగా నిలిచారు. అయితే మరి కొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

 

బంద్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేసినట్లు నగర కొత్వాల్‌ భాస్కరరావు వెల్లడించారు. బంద్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్దమని ప్రకటించారు.  ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.

 

ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి... ప్రయివేటు స్కూళ్ళు కూడా వాటి మీదకు రావు... అక్కడి ప్రభుత్వం విద్యావ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి పెట్టిందనేది పై ఫోటోలను చూస్తే అర్థమవుతుంది...  ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్యం మీద ఖచ్చితమైన దృస్థి పెడితే ప్రజలు జేజేలు పలకడం ఖాయం...

మరింత సమాచారం తెలుసుకోండి: