బ్రతుకు సమరంలో మనిషి జీవితం నిరంతర పోరాటమయం. ప్రకృతితోనూ, ఆధిపత్య శక్తులతోనూ మాత్రమే కాదు ఒకానొక చారిత్రక భౌతిక పరిస్థితులవల్ల దాపురించిన భావజాలంతోనూ మనిషి పోరాడుతూనే వుంటాడు. పోరాడుతూనే వుండాలి. ఇది మానవ లక్షణం. అయితే ఈ పోరాటంలో ఎన్నో మూఢ నమ్మకాలు, మనిషి విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఉంటాయి.. ఇకపోతే నమ్మకాలు కానివ్వండి, మూఢనమ్మకాలు కానివ్వండి మనిషి పుట్టినప్పటి నుండి వెంటే వస్తున్నాయి.. ఇవి ఈ పుడమి పై మనిషి అన్న జీవి అంతరించే వరకూ వుంటాయి..

 

 

ఇక సత్యాన్ని సత్యంగా నమ్మినా, అసత్యాన్ని అసత్యంగా నమ్మినా, ఆ నమ్మకం వాస్తవానికి బ్రతికి ఉన్నట్లే. కాని అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యం గానూ నమ్మితే దాన్నే మూఢనమ్మకం అంటారు.. ఇకపోతే ఈ సమాజంలో ఇలాంటి వాటిని నమ్ముకుని బ్రతుకుతున్న వారు అక్కడక్కడ తారస పడుతూనే ఉంటారు.. ఇలాంటి ఘటన గురించే ఇప్పుడు చెప్పబోయేది.. కొంత భయానకంగా, విస్తు పోయేలా జరిగిన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో కలకలం రేపుతుంది..

 

 

మండలంలోని ఆరిపాటి దిబ్బల సమీపంలోని జామాయిల్ తోటలో బుధవారం అర్ధరాత్రి దున్నపోతు అరుపులు, మంత్రాల శబ్ధం రావడంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు జామాయిల్ తోటకు వెళ్లి చూడగా.. అక్కడ నిమ్మకాయలు, రక్తం, పసుపు, కుంకుమ కనిపించడంతో క్షుద్రపూజలు జరిగినట్లుగా గ్రహించి. ఘటన సమీపంలోనే ఉన్న మహిళను పట్టుకుని చితకబాదిన అనంతరం అక్కడ ఉన్న పూజా సామాగ్రిని తోటలోకి తీసుకెళ్లి తగులబెట్టారు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో పరిశీలించి చూడగా సృష్టంగా క్షుద్రపూజ నిర్వహించినట్లు తెలిసింది, ఇదే కాకుండా ఓ దున్నపోతును కూడా బలి ఇచ్చినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి.

 

 

ఇక ఈ తతంగం అంతా వారం రోజుల నుంచి జరుగుతుందని స్థానికులు చెబుతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు ఇలాంటి మూఢనమ్మకాలను రూపుమాపాలని చర్యలు తీసుకుంటున్న వేళ ఇలాంటి సంఘటనలు ఇంకా అక్కడక్కడ జరగడం పలువురు ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ఇంకా సమాజంలో  ఇలాంటి వారు చలనం లేకుండా జీవిస్తున్నారని అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: