గాంధీ ఆసుపత్రిలో గూండాగిరి.. అవును... మూడు రోజుల క్రితం సీనియర్ వైద్యుడు డాక్టర్ వసంత్ ఆస్పత్రి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రతి దాంట్లో ఆస్పత్రిలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ వీరంగం సృష్టించారు. ఈ వ్యవహారంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ హెచ్ఓడీలు, హౌజ్ సర్జన్‌లతో గురువారం సమావేశం అయ్యారు. 

 

డాక్టర్ వసంత్ మతిస్తిమితం లేకుండా అడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సూపరింటెండెంట్ కొట్టిపారేశారు. గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని వివరణ ఇచ్చారు. వసంత్ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో బయోమెట్రిక్ పరికరాలు గత రెండేళ్లుగా పని చేయడం లేదని డాక్టర్ వసంత్ ఆరోపించిన నేపథ్యంలో సూపరింటెండెంట్ శ్రవణ్ స్పందించారు. ఇవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. గాంధీలో అన్ని వ్యవస్థలు పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని చెప్పారు. 

 

‘‘మాకు వ్యక్తిగత ద్వేషాలు ఎవరిపైనా లేవు. కరోనా విషయంలో వసంత్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఆయనపై చర్యలు తీసుకున్నాం. ఒక మతిస్తిమితం లేని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వైద్యుడు అతను. తాను మాట్లాడే మాటలకు జరుగుతున్న విషయాలకు ఏ సంబంధం లేదు. అతను హంగామా ప్రభుత్వం చూసింది. అతను ఎంత మంది వద్ద డబ్బు తీసుకున్నాడో అందరికీ తెలుసు. దానికి సంబంధించి ఆడియో టేపులు, సీసీటీవీ వీడియోలు ఉన్నాయి. వాటిని మీరే పరిశీలించండి. ఇక్కడి వ్యవస్థ పరిశీలించాకే మీరు తుది నిర్ణయం తీసుకోండి.’’ అని సూపరింటెండెంట్ శ్రావణ్ అన్నారు. 

 

ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ ఫోన్‌లో ఓ కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్న ఆడియో టేప్‌ను బయటపెట్టారు. ఇందులో డాక్టర్ వసంత్ కాంట్రాక్టర్‌ను బూతులు తిడుతూ, బెదిరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. వసంత్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అతణ్ని బతిమాలుకుంటున్నాడు. ‘‘నేను ఊరుకోను. వాడ్ని రమ్మను. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్తా నేను. ఏమనుకుంటున్నాడు వాడు. అవకాశాలు అయిపోయినయి.. నేను ఊరుకోను.’’ అని వసంత్ మరో కాంట్రాక్టర్ గురించి ఓ కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తనపై కావాలనే తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని డాక్టర్ వసంత్ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: