ఫిబ్రవరి 14వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు మరెంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి.  మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి చూసి అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి..? 

 

 అంతర్జాతీయ మైనింగ్ సదస్సు : 2018 ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ మైనింగ్  సదస్సు జరిగింది. ఖనిజాల అన్వేషణ తవ్వకాలు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు తోపాటు మైనింగ్ అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. 

 

 పుల్వామా దాడి : 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన  రోజు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద... లేతిపుర సమీపంలో కారుతో  ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు... ఒక ఉగ్రవాది మరణించారు. ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

 

 దిగవల్లి వెంకటశివరావు జననం :  స్వతంత్ర సమరయోధుడు సాహిత్యాభిలాశి  అయినా దిగవల్లి వేంకటశివరావు 1898 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. అడ్వకేట్ గా కూడా పని చేశారు. ఈయన చరిత్ర పరిశోధకులు రచయిత న్యాయవాది. ఎంతోమంది చరిత్ర కారులను పరిశోధించి ఎన్నో పుస్తకాలను రచించారు దిగవల్లి వేంకటశివరావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన ఈయన  వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ సాహిత్యాభిలాషలో  ఎంతగానో కృషి చేశారు. 

 

 దామోదర సంజీవయ్య జననం  : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మంత్రి పదవులు నిర్వహించారు దామోదరం సంజీవయ్య. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా నియమింపబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు గా పని చేశారు.38 సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బ కొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సులన్ని జాతీయకరణ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వ్యతిరేకత వ్యాఖ్యలు చేయడం వల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా ఉన్న  దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. 

 

 ఘంటా  గోపాల్ రెడ్డి జననం  : వ్యవసాయ శాస్త్రవేత్త మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎత్తిపోతల పథకాలు సృష్టికర్త అయిన ఘంటా  గోపాల్ రెడ్డి 1932 ఫిబ్రవరి 14 న   నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి  లో జన్మించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించిన ఘంటా  గోపాల్  రెడ్డి  నల్గొండలో వ్యవసాయ విస్తరణ అధికారి కూడా కొంతకాలం సేవలందించారు. ఇక 7 గ్రాముల రైతులను సమీకరించి రైతుల సహకారంతో రైతు సేవా సహకార సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి రైతులకు అనేక సేవలు అందించారు ఘంటా  గోపాల్ రెడ్డి. 

 

 సుష్మాస్వరాజ్ జననం : భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్... బిజెపి పార్టీలో ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. కాగా సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గా సుష్మా స్వరాజ్ పనిచేశారు. వర్తమాన భారత దేశ మహిళ రాజకీయ నేతల్లో ప్రముఖులు సుష్మా స్వరాజ్. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. హర్యానా రాష్ట్రంలో శాసన సభలో మొదట కాలు పెట్టారు. ఇక అదే సమయంలో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా ప్రభుత్వంలో మంత్రిగా స్థానం సంపాదించారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న మహిళ నేతలందరికీ సుష్మా స్వరాజ్ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. 

 

 రాజబాబు మరణం: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు హాస్యనటుడు రాజబాబు. ఈయన 1983 ఫిబ్రవరి 14వ తేదీన మరణించారు.  ఎన్నో సినిమాల్లో హాస్య నటుడిగా తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు రాజబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: