సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తన చుట్టూ పదిమంది ఉండాలని అనుకుంటారు. ఏ పని లేకున్నా కాస్త హడావిడి చేయాలని చూస్తారు. అందులోనూ ఎమ్మెల్యే పదవి ఉంటే వారు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అయితే అందరూ ఎమ్మెల్యేలు మాదిరిగా కాకుండా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చాలా డిఫరెంట్‌గా ఉన్నారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తుంది. ఆయన ఎక్కువ హడావిడి చేయకుండా, అనుచరులకు పెత్తనం ఇవ్వకుండా నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

 

సాధారణ కుటుంబం నుంచి వచ్చి తిరుమల డెయిరీ పెట్టి, మంచి లాభాలు గడించి, దాన్ని వల్లభ డెయిరీగా మార్చుకుని బిజినెస్‌మెన్‌గా ఎదిగిన బొల్లా బ్రహ్మనాయుడు, 1999లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అప్పుడే వినుకొండ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ టికెట్ దక్కక టీడీపీ నాయకుడుగానే కొనసాగారు. ఇక 2009లో టీడీపీని వదిలేసి ప్రజారాజ్యం తరుపున వినుకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

అయితే ఆ తర్వాత కూడా కాలం కలిసిరాకపోవడంతో 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి పెదకూరపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 కలిసి రాకపోయినా,  2019లో ఆయన సుడి తిరిగి వైసీపీ తరుపున వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా హడావిడి చేయకుండా, నియోజకవర్గానికి ఎలాంటి నిధులు వచ్చిన ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. అనుచరులు ఏమైనా కాంట్రాక్ట్‌లు దక్కించుకున్న వారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా చూసుకుంటున్నారు. ప్రతి పనిలోనూ క్వాలిటీ మెయింటైన్ చేయాలని అనుచరులు వెంట పడుతున్నారు.

 

అలాగే అనుచరులు ఖాళీగా తన దగ్గరకు వచ్చి ఉంటే, వెంటనే తిట్టి వారిని ఏదొక పని చేసుకోమని చెబుతున్నారు. ఏదైనా పని ఉంటే తప్ప తన దగ్గరకు రానివ్వడం లేదు. అయితే ఎమ్మెల్యే పనితీరు అంతా బాగున్న మూడు రాజధానుల ప్రభావం వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మనాయుడు మీద ఎంత పడుతుందో తెలియకుండా ఉంది. మొత్తానికైతే ప్రజలకు మంచి చేసే విషయంలో బ్రహ్మనాయుడు సొంత వాళ్ళని సైతం లెక్క చేయకుండా ముందుకెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: