అవును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో రెచ్చిపోయిన అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్ళు ఏమీ లేదు కేవలం పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదని భావించిన అధికారులకు జగన్ ఇప్పుడు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ముందు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ని తప్పించిన జగన్ సర్కార్ ఆ త‌ర్వాత సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ఆలూరి బాల వెంకటేశ్వరరావుని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారి చేసారు. ఇక ఏకంగా గ‌త ప్ర‌భుత్వంలో ఇంటిలిజెన్స్ అడిష‌న‌ల్ డీజీగా ప‌నిచేసిన ఏబీ. వెంక‌టేశ్వ‌రావును ఏకంగా స‌స్పెండ్ చేసింది.

 

దీనితో ఒక్కసారిగా కలకలం మొదలయింది. చంద్రబాబు మాటలు విని అప్పుడు కొందరు వైసీపీ నేతలను కీలక అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు వారు అందరిని తప్పించే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. అధికారం ఉందని చంద్రబాబు రెచ్చిపోతే ఇప్పుడు జగన్ అదే విధంగా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. ఏబీ విషయంలో జరిగింది ఇదే. ప్రభుత్వం నుంచి వచ్చే కాంట్రాక్టులను కూడా వాళ్ళు తీసుకోవడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.

 

విద్యుత్ ఒప్పందాలు సహా పలు కీలక ప్రాజెక్టుల్లో కూడా వాళ్ళు వాటాలు తీసుకున్నారు. దీనితో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే భయ౦ చంద్రబాబు సన్నిహిత అధికారులలో క్రమంగా వ్యక్తమవుతుంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న అధికారులు ఒక్కొక్కరు భయపడే పరిస్థితి ఏర్పడింది. త్వరలో మరో అధికారిని విధుల నుంచి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. సదరు అధికారి విద్యుత్ శాఖలో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. దీనితో ఇప్పుడు కొందరు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా జ‌గ‌న్ దెబ్బ‌తో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇష్టారాజ్యంగా ఉన్న అధికారులు అంద‌రూ మామూలు టెన్ష‌న్‌తో ఉండడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: