దేశ వ్యాప్తంగా ప్రాంతీయ  రాజకీయ పార్టీలన్నీ  ప్రశాంత్ కిషోర్ తమ  ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తే చాలు .. ఇక  తమ విజయం ఖాయమని భావిస్తున్నాయి  . ఎన్నికల వ్యూహకర్తగా   ఆయన సక్సెస్  ట్రాక్ రికార్డ్ ఆ స్థాయికి చేరుకుంది  .  ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగానే కాకుండా , రాజకీయ నాయకునిగా కూడా సక్సెస్ కావాలని ఆరాటపడుతున్నారు . అందుకే  ఈ నెల 18 న ఆయన  కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది . అయితే ఆ ప్రకటన సారాంశం ఏమై  ఉంటుందన్నది  ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయనేతగా  జేడీయూ లో చేరారు .

 

అయితే ఆ పార్టీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో విబేధాల కారణంగా  ఆయన పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది . ప్రశాంత్ ను నితీష్ ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు . అయితే తలమీద ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం , అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తుండడం తో నోరు విప్పలేదు . అందుకే తన బహిష్కరణ అనంతర పరిణామాలపై ఆయన   ఈ నెల 18 న కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది . అయితే ఆ కీలక  ప్రకటన ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్  సేవలను వినియోగించుకునేందుకు పలు ప్రాంతీయ పార్టీలు తహ , తహ లాడుతున్నాయి  .  

 

దానికి కారణం లేకపోలేదు .  ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ , ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీని అధికార పీఠం వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యారు . అందుకే ప్రశాంత్ ఈ నెల 18 న ఒకవేళ సొంతపార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తే , తమ పరిస్థితి ఏమిటోనని ఇప్పటికే అయన సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్న పార్టీలు ఆందోళనలో ఉన్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: