2019 ఎన్నికల్లో అన్నీ జిల్లాలోనూ అదిరిపోయే ఫలితాలు రాబట్టిన వైసీపీకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రాబట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని కొన్ని జిల్లాలో తెదేపాతో గట్టి పోటీ ఎదురుకోవడం ఖాయమని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అలా వైసీపీ టీడీపీతో టఫ్ ఫైట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

మొన్న ఎన్నికల్లో వెస్ట్ లో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 13 గెలిస్తే, టీడీపీ రెండు గెలుచుకుంది. ఇక ఈ ఫలితం బట్టి చూస్తే వైసీపీకే అంతా అనుకూలంగా ఉందని అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , మూడు రాజధానులు అంశం, జగన్ పాలన బాగానే ఉన్న, లోకల్‌లో అధికార నేతల డామినేషన్ వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

ముఖ్యంగా మూడు రాజధానుల వల్ల పశ్చిమ గోదావరికి లాభం లేదు, అలా అని నష్టం కూడా పెద్ద లేదు. కాకపోతే విశాఖపట్నంతో పోలిస్తే వెస్ట్‌కు అమరావతినే దగ్గర. పైగా ఏలూరు, విజయవాడ, గుంటూరు నగరాలు కలిసికట్టుగా ఉన్నట్లు ఉంటాయి దీనికి తోడు వెస్ట్‌లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. అదేవిధంగా సొంత పార్టీలోనే కొన్ని లుకలుకలు ఉన్నట్లు అర్ధమవుతుంది.

 

ఇక ఇలాంటి పరిస్తితుల్లో రానున్న పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్‌గా ఫలితాలు రావడం కష్టమని అంటున్నారు. కాకపోతే జిల్లాలో అతి పెద్దదైన ఏలూరు నగర సంస్థ వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి అంటున్నారు. అలాగే పలు ప్రధాన మున్సిపాలిటీలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం టీడీపీతో గట్టి పోటీ ఎదురుకోవడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో పోటీ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి చూడాలి వైసీపీ వెస్ట్‌లో క్లీన్ స్వీప్ చేస్తుందో లేదో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: