రాజకీయాల్లో ఎక్కడైనా ఒక్క టర్నింగ్ పాయింట్ వస్తే చాలు మొత్తం పరిస్తితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఎన్ని సమస్యలు ఉన్న అన్నిటికి ఒకే సమాధానం రూపంలో పరిష్కారం దొరుకుతుంది. సరిగ్గా ఇలాగే జగన్‌కు టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది. తాను అభివృద్ధి కోసమని తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీతో సహ మిగిలిన విపక్ష పార్టీలు నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

 

ప్రాంతాలు వారీగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే వీరి నెగిటివ్ ప్రచారం వల్ల కొన్ని ప్రాంతాల్లో జగన్‌కు అనుకూల వాతావరణం లేకుండా పోయింది. ఇక ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దెబ్బ తినే అవకాశాలు పుష్కలంగా కనిపించాయి. సరిగ్గా ఇలాంటి నెగిటివ్ పరిస్థితులు ఉన్న తరుణంలోనే జగన్‌కు కేంద్రం రూపంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది.

 

రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో తమ జోక్యం లేదని పార్లమెంట్ నుంచి సమాధానం వచ్చింది. అలాగే మండలి రద్దు వ్యవహారం కూడా రాజ్యాంగబద్దంగానే జరుగుతుందనే చెప్పడంతో జగన్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రకటనలకు మరింత బలం వచ్చేలా ,తాజాగా మోడీ మద్ధతు జగన్‌కు దొరికింది. మోడీ మూడు రాజధానులకు, మండలి రద్దు వ్యవహారాలపై సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. దీంతో జగన్‌కు పరిస్తితులు అనుకూలంగా మారిపోయాయి.

 

తాను అనుకున్నట్లుగానే మూడు రాజధానులు ఏర్పాటు చేయగలరు, మండలి రద్దు కూడా పూర్తి అయిపోతుంది. ఇక ఇటు జగన్ పట్ల వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కూడా మారిపోయారు. కేంద్రమే సానుకూలంగా ఉన్నాక, తాము వ్యతిరేకించిన ఉపయోగం లేదని తెలుసుకున్నారు. ఇప్పటికైనా జగన్‌కు మద్ధతు తెలిపితే అంతా సవ్యంగా జరిగిపోతుందని ఫిక్స్ అయ్యారు. అనవరమైన ఆందోళనలు జోలికి పోకుండా, ప్రతిపక్షాలు రాజకీయాలని నమ్మకుండా ఉండేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికైతే జగన్‌కు కరెక్ట్ టైమ్‌లో టర్నింగ్ పాయింట్ వచ్చిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: