మనసా వాచా కర్మణా  అంటూ ఒకసారి పెళ్లి బంధం పై ఏర్పడిన తర్వాత... భార్యకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది. ఏ సమస్య వచ్చినా భర్తే  ముందుండి పరిష్కరించాల్సి ఉంటుంది. భర్త భార్య కు రక్షణగా నడవాలి. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ముందుండి నడిపించాలి. కానీ ఇక్కడ  భర్త మాత్రం భార్య కు సమస్యగా మారిపోయాడు.  ఎంతలా సమస్య గా మారిపోయాడు అంటే..  ఏకంగా తన పడక గదిని వేరే వాళ్ళతో పంచుకోవాలని అని భార్యకు సూచించడం మొదలుపెట్టాడు భర్త . తనతో పాటు తన తండ్రి కోరిక కూడా తీర్చాలంటూ భార్యపై వేధింపులు మొదలుపెట్టాడు. ఆ మహిళ అందుకు నిరాకరించడంతో ప్రతిరోజు వేధింపులు చేస్తుండేవాడు. ఇక వేధింపులు తట్టుకోలేని మహిళా రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించింది. 

 

 

 బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది... వివరాల్లోకి వెళితే... బీహార్ పాట్నా నగరానికి చెందిన ఓ మహిళ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తన భర్త తనపై ఎంతగానో ఒత్తిడి తీసుకువస్తున్నారని... తండ్రి ఇంకా యువకుడేనని  తనలాగే అతడిని కూడా సుఖపెట్టాలి అంటూ తన భర్త తనపై రోజురోజుకు ఒత్తిడి ఎక్కువ తీస్తున్నాడు అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మామతో  అలాంటి చెడు పనులు చేయను అని చెప్పినందుకు నన్ను రోజూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. 2012 సంవత్సరంలో ఆ మహిళకు ముజఫర్పూర్ కు చెందిన మహమ్మద్ జాఫర్ తో పెళ్లి జరిగింది. 

 

 

 అనంతరం అత్తగారింట్లో కాపురం పెట్టింది ఆ మహిళ. అయితే వీరిద్దరి పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అత్త చనిపోయింది. దీంతో భర్త మామల తో కలసి నివసిస్తుంది సదరు మహిళ. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం పండుగ కోసం వెళ్లినప్పుడు తన భర్త అసలు విషయం బయట పెట్టినట్లు  చెప్పింది. అదే సమయంలో ఓ రోజు బాత్రూం లో దుస్తులు ఉతుకుతుంటే.. తన మామ వెనుక నుంచి వచ్చి హత్తుకో పోయాడు అంటూ చెప్పుకొచ్చింది సదరు బాధిత భార్య. అయితే ఈ విషయాన్ని భర్తకు చెబితే ఆయన కూడా వయసులోనే ఉన్నాడని.. తన తండ్రిని కూడా సుఖపెట్టాలి అంటూ భర్త చెప్పడంతో షాక్కి గురయ్యానని తెలిపింది. కాగా వాళ్ళు చెప్పినట్లుగా చేయకపోవటంతో... రోజు కొడుతు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని...   రోజుకు భర్త ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించినట్లు తెలిపింది సదరు బాధిత భార్య.

మరింత సమాచారం తెలుసుకోండి: