ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గోదావరి ఘాట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా గోదావరి ఘాట్ కు చేరుకొని అక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి... కాలేశ్వరం సమీపంలోని ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 14 టీఎంసీలలో కళకళలాడుతున్న లక్ష్మి బ్యారేజ్ పరిశీలించి పలు మోటార్లను స్విచ్ఛాన్ చేశారు. ఇదిలా ఉంటే కాలేశ్వరం సందర్శన అనంతరం కరీంనగర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధికారుల పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం  కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని... వారిపై మండిపడ్డారు. అధికారులు హుందాగా  ప్రవర్తించాలి అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు సూచించారు. సైకిల్ ఎక్కడం ట్రాక్టర్పై వెళ్లడం లాంటి పనులు సరికాదు అంటూ సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. అధికారులను సొంత పాపులారిటీ  కోసం పాకులాడటం సరికాదు అంటూ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సొంత అజెండాలతో పనులు చేయవద్దు అని సూచించారు. 

 

 

 ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ నెలాఖరు లోగా ఇరిగేషన్  ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నెలాఖరు లోగా ఇరిగేషన్ అధికారులు,  సిబ్బందికి క్వర్టర్ల  నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ తో పాటు నిజాంబాద్ జిల్లా కేంద్రాల్లో... ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్  స్థానంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: