ఒకే ఇంట్లో.. ఒకే రోజు.. ఐదు శవాలు కనిపించాయి. ఆ కుటుంబంలోని ఐదుగురూ శవాలై కనిపించారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి సాక్ష్యమే లేకుండా పోయింది. చివరకు ఆ చుట్టుపక్కల వాళ్లకు దుర్వాసన వచ్చే వరకూ అక్కడ అన్ని శవాలు ఉన్నాయన్న విషయమే తెలియలేదు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన పోలీసులకు ఈ ఐదు శవాలు మిస్టరీగా మారాయి.



ఇదంతా ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతం జరిగింది. భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు అంతా శవాలైపోయారు. మొదట ఈ శవాలను చూసి కుటుంబమంతా ఆత్మహత్యలు చేసుకున్నారేమో అనుకున్నారు. అందులోనూ చనిపోయిన శంభునాథ్ ఓ రిక్షా పుల్లర్.. ఆర్థిక కష్టాలు తాళ లేక.. కుటుంబాన్ని పోషించలేక.. అంతా విషం పుచ్చుకుని చనిపోయారేమో అనుకున్నారు. కానీ విచారణలో అవి ఆత్మహత్యలు కావని.. హత్యలేనని తేలింది.



శంభునాథ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తక్కువ సమయంలోనే నిందితుడు.. ప్రభును పట్టుకున్నారు. ఇంతకీ ఈ ప్రభు ఎవరో కాదు.. శంభునాథ్ కు సమీప బంధువే. మరి ఎందుకు ఇతడు శంభునాథ్ తో సహా అతని కుటుంబ సభ్యులందరినీ చంపేశాడు.. ఇందుకు పోలీసులు చెప్పిన కారణం వింటే.. మీరు ఆశ్చర్యోపోవాల్సిందే.



కేవలం 30 వేల రూపాయల కోసమే ప్రభు శంభునాథ్ కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్నాడు. గతంలో శంభునాథ్ ప్రభుకు రూ. 30 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇచ్చి చాలాకాలం కావడంతో .. తన అప్పు సొమ్ము చెల్లించాలని ప్రభుపై శంభునాథ్ ఒత్తిడి తెచ్చాడు. అంత సొమ్ము ఇవ్వడం కష్టమని భావించిన ప్రభు.. చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి అందరినీ చంపేసి వెళ్లిపోయాడు. చూశారా ఎంత దారుణమో.. అవసరానికి ఆదుకుని అప్పు ఇచ్చినందుకు శంభునాథ్ కుటుంబానికి ఏం గతి పట్టిందో. కలికాలం అంటే ఇదేనేమో..?



మరింత సమాచారం తెలుసుకోండి: