జరిగిన తప్పిదాల నుంచి బయట పడేందుకు బాబోరు దిద్దుబాటు చర్యలు చెప్పారు. ఈ క్రమంలోనే అధికార పీఠాన్ని అధిష్టించేందుకు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలను అనుసరించేందుకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్ర బాబు నాయుడు సర్వ సార్ధమవుతున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని 23 సీట్లకు పరిమితమైన టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఎలా అనే దానిపై ఆ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

 

అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని నిర్ణయించిన టీడీపీ అధినాయకత్వం... ఇందుకోసం అప్పుడే ఓ ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోనే నంబర్‌వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ స్నేహితుడు, ఆయన నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థల‌కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మను ఈ మేరకు టీడీపీ నాయకత్వం ఎంపిక చేసుకుందని తెలుస్తోంది.

 

రాబిన్ శర్మ ఇప్పటికే తన బృందంతో రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని కూడా ప్రారంభించారని ప్రచారం సాగుతోంది . రాబిన్ శర్మ గతంలో నరేంద్రమోడీ ప్రచార వ్యవహారాలను చూసుకున్నారు. రాబిన్ శర్మ పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే నాలుగేళ్ల వరకూ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల ప్రకటన, కులపరమైన రాజకీయల విభజన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ బృందం... త్వరలోనే దీనిపై చంద్రబాబుకు ఓ నివేదిక ఇవ్వనుందని తెలుస్తోంది.రాబిన్ శర్మ ఇప్పటికే తన బృందంతో రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని కూడా ప్రారంభించారని ప్రచారం సాగుతోంది 
\

మరింత సమాచారం తెలుసుకోండి: