తూర్పుగోదావరి జిల్లాలోని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫిబ్రవరి 13  న  రాష్ర్ట వ్యవసాయశాఖమంత్రి  కురసాలకన్నబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ర్ట సంబంధాలు చూసి చంద్రబాబుకు ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు రాలేదు. అధికారంలేకపోతే ఒక్క గంట కూడా గడపలేని పరిస్దితికి చంద్రబాబు చేరుకున్నారు. ప్రధాని,ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఆ మాటలు మీకెలా తెలిసాయి. మీరు ఏమైనా కార్పెట్లు క్లీన్ చేస్తున్నారా..కాఫీ కప్పులు తీస్తున్నారా... ప్రధానిమోది, సిఎం వైయస్ జగన్ భేటిపై టిడిపి దుష్ర్ర్పచారం చేస్తోంది. చంద్రబాబు 32 సార్లు ఢిల్లీ వెళ్లినా ఏమీ సాధించలేకపోయారు.

 

పచ్చమీడియాలో ఢిల్లీ వెళ్లినా ప్రతిసారీ చంద్రగర్జన...మోది గురించి విమర్శలు చేస్తూ ప్రచురించేవారు. సిగ్గులేకుండా ఏదిపడితే అది ఆరోజు మాట్లాడి ఈరోజు తగుదునమ్మా అంటూ జగన్ గారి పర్యటనపై విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత అవసరాలకోసం కాళ్లు పట్టుకునే పరిస్దితి చంద్రబాబుది. కొన్ని పత్రికలు జగన్ గారి పర్యటనపై ఏమీ రాస్తున్నారో తెలియకుండా రాసేస్తున్నాయి. శాసనమండలి రద్దు చేస్తున్నామంటే యనమల, లోకేష్ ల మైండ్ బ్లాక్ అయింది. యనమల ప్రపంచంలో తానొక్కడే మేధావి అని అనుకుంటున్నారు. మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మటానికి ప్రజలు సిధ్దంగా లేరు.

 

ఢిల్లీనుంచి దావోస్  వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చారు. రాజధానిని తరలిస్తున్నట్లు చంద్రబాబు కృత్రిమ ఉద్యమం సృష్టించారు. రాష్ర్టంలో ఏదో జరిగిపోతుందన్నట్లు భ్రమలు సృష్టించారు. అదీ చాలదన్నట్లు జోలి పట్టుకుని బాబ్బాబు అంటూ అడుక్కుంటున్నట్లు డ్రామాలు ఆడారు.జోలెలో పడ్డ బంగారం,వెండి,డబ్బు ఏమయ్యాయో చంద్రబాబు చెప్పాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి చంద్రబాబుకు తెలియదా..అక్కడి ప్రజల మనోభావాలు చంద్రబాబుకు పట్టవా అని నిలదీశారు.

 

చంద్రబాబుకి పార్టీని బతికించుకోవాలనే తపన తప్ప రాష్ర్ట ప్రయోజనాలు కనిపించడం లేదు. ఆర్దిక సంక్షోభంలోకి ఎవరు ఎవర్ని నెట్టారో చర్చకు సిధ్దం. రాష్ర్టాన్ని అప్పులఊబిలోకి నెట్టింది మీరు కాదా,ఆర్దికపరిస్దితిని ఛిన్నాభిన్నం చేసింది యనమలే. దొరికిన చోటల్లా అఫ్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. పోలవరంలో కమీషన్లకోసం కక్కుర్తి పడ్డారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబేనాని మండిపడ్డారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: