నేడు ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఈ ప్రేమికుల రోజు గురించి ఏమని చెప్తం.. ప్రపోజ్ చెయ్యాలి అనుకునే వారు ఈరోజు చేస్తారు.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు. స్వేఛ్చమైన ప్రేమ ఈ కాలంలో చాలా అరుదుగా దొరుకుతుంది. పల్లెల్లో అక్కడక్కడా స్వేఛ్చమైన ప్రేమ కనిపిస్తే.. నగరాల్లో 95 శాతం కామప్రేమ కనిపిస్తుంది. 

 

అలాంటి కాలంలో మనం బతుకుతున్నాం. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ వారం అంత.. రోజ్ డే, హగ్ డే, కిస్ డే, ప్రపోసల్ డే అంటూ ప్రేమికులు ఘనంగా జరుపుకున్నారు. అయితే అన్నిటికంటే స్పెషల్ డే అయినా ఈరోజు మాత్రం ఘనంగా జరుపుకోలేరు.. ఎందుకంటే? బయట ఎక్కడ కలిసిన ప్రేమికులకు చుక్కలే.. 

 

ఎంతో గొప్పగా.. ఘనంగా జరుపుకోవాలి అని ప్లాన్ వేసిన బయట బహిరంగ ప్రదేశాల్లో తిరగలేరు.. కలవలేరు.. ఒకవేళ ఎలాగైనా కలవాలి.. మాట్లాడుకోవాలి.. కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకున్నారు అంటే మాత్రం ప్రేమికులుగా ఇదే చివరి వాలంటైన్స్ డే జరుపుకుంటారు.. ఎందుకంటే భార్య భర్తలు అయిపోతారు కాబట్టి. 

 

ఎందుకంటే.. ప్రేమికులు అయినా మీరు ఈరోజు బయటకు.. లేదా పార్క్ కు వెళ్లారు అంటే.. వెంటనే పెళ్లి అయిపోతుంది. కారణం భజరంగ్ దళ్, విశ్వా హిందూ పరిషత్ లాంటి సంస్థలు. ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు పార్కుల్లోకి వచ్చి ప్రేమికులు కనబడితే వారికి పెళ్లిళ్లు చేసేస్తారు. 

 

ఏం అంటే ఇది మన సంస్కృతి కాదు అంటారు.. మన సంస్కృతి పెళ్లి చేసుకోవడం. కాబట్టి మీకు పెళ్లి చేస్తాం అని బలవంతంగా పెళ్లి చేసేస్తారు.. ఈ ఘటనలు అన్ని మనం గతంలోనే చూసినవే.. అందుకే మీ ప్రేమ ఎంత స్వేఛ్చమైనది అయినా ఈరోజు బయటకు వస్తే మాత్రం పెళ్లి చేసుకోకా తప్పదు.. కాదు కూడదు అని వచ్చారు అంటే మీకు లక్షల డబ్బు మిగిలిపోతుంది. కారణం మీ పెళ్లి భజరంగ్ దళ్ వారు పార్క్ లో ఘనంగా పెళ్లి చేస్తారు.. ఆ పెళ్లి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కాబట్టి మీకు పెళ్లి ఖర్చు ఉండదు.. ఫ్రీ పబ్లిసిటీను సొంతం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: