ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమో గాని ఇప్పుడు రాజకీయంగా ఈ పరిణామం తెలుగుదేశం సహా కొందరికి భయం భయంగా మారింది అనేది వాస్తవం. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటి సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ఎం బయటపడిందో ఏమో తెలియదు గాని, చాలా వరకు కీలక పత్రాలను ఐటి అధికారులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఐటి నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. సోదాల్లో రెండు వేల కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్టు ఐటి ప్రకటించింది. 

దీనితో ఈ సోదాల్లో అసలు ఎం దొరికాయి అనే ఆందోళన టీడీపీ అధినేత చంద్రబాబుని భయపెడుతుంది. వాస్తవానికి చంద్రబాబు ఈ విధంగా అంచనా వేయలేదు. తన మాజీ పిఎస్ ని ఏ విధంగా టార్గెట్ చేస్తారు లే అనుకున్నారు ఆయన. కాని అనూహ్యంగా శ్రీనివాస్ ని టార్గెట్ చేసారు. ఐటి అధికారులు పేర్లు చెప్పకపోయినా గాని కీలక పత్రాలను మాత్రం ఒకరి ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించి అలజడి రేపారు. ఇప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా దీనిని జాగ్రత్తగా కవర్ చేస్తూ టీడీపీ కార్యకర్తల్లోను నేతల్లోనూ భయం లేకుండా ఉండే విధంగా చూస్తుంది. 

ఇక జగన్ ఢిల్లీ వెళ్లి రాగానే ఈ ప్రకటన రావడం టీడీపీని మరింత కలవరానికి గురి చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బాబుని టార్గెట్ చేశాయని, చంద్రబాబు అవినీతి విషయంలో జగన్ సహకారం తీసుకుని ముందుకి వెళ్ళాలి అని మోడీ భావిస్తున్నారని అంటున్నారు. రాజకీయంగా ఈ పరిణామం ఇప్పుడు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇప్పుడు చంద్రబాబు బిజెపిలో ఉండే తన టీం ద్వారా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎవరి మీద అయినా దాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: