టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాలలో ఉచిత దర్శనం లభించనుందని తెలిపారు. వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో ఉచిత దర్శనం కొరకు రెండు సమయాలను కేటాయించినట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 3 గంటలకు ఉచిత దర్శనం లభించనున్నట్టు చెప్పారు. 
 
30 నిమిషాలలో ఉచిత దర్శనం పొందాలనుకునే వృద్ధులు ఫోటోతో కూడిన వయస్సు నిర్ధారణ పత్రాలను కలిగి ఉండాలి. వయస్సు నిర్ధారణ పత్రాలను ఎస్1 కౌంటర్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. వృద్ధులు కూర్చోవడానికి వీలుగా ఆలయానికి కుడి వైపు బ్రిడ్జి కింద గోడ పక్కన మంచి సీట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులకు టీటీడీ వేడి పాలు, సాంబారన్నం, పెరుగన్నం ఉచితంగా ఇవ్వనుంది. 
 
60 సంవత్సరాలు దాటిన భక్తులకు టీటీడీ 20 రూపాయల రెండు లడ్డూ టోకెన్లను ఇస్తుంది. టీటీడీ 25 రూపాయలకు ఒక లడ్డూ చొప్పున ఎన్ని లడ్డూలైనా భక్తులు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. 60 సంవత్సరాలు దాటిన భక్తులకు కౌంటర్ నుండి గుడి వరకు మరియు గుడి నుండి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. 
 
ఉదయం 10 గంటల సమయంలో మరియు మధ్యాహ్నం 3 గంటల సమయంలో 60 సంవత్సరాల వృద్ధుల కోసం అన్ని క్యూ లైన్లు నిలిపివేయబడతాయి. కేవలం 30 నిమిషాలలో వృద్ధులకు శ్రీవారి దర్శనం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా పూర్తవుతుంది. వెంకన్న దర్శనం కొరకు తిరుమలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సగటున రోజున 50,000 నుండి 60,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వలన 60 సంవత్సరాలు దాటిన భక్తులకు వేగంగా మరియు సులభంగా శ్రీవారి దర్శనం జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: