తెలంగాణాలో బిజెపి బలపడాలని భావించడం ఏమో గాని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలకు మాత్రం ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఎం చెయ్యాలో అర్ధం కాక, ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలో అర్ధం కాక, బలంగా ఉన్న కెసిఆర్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో సతమవుతూ వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. రాజకీయంగా తెరాస ఇప్పుడు చాలా బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీని ఎదుర్కొని నిలబడి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలిచి తన సత్తా ఏంటో చూపించింది. 

అక్కడి వరకు బాగానే ఉంది గాని, అక్కడి నుంచి ఇప్పుడు ఆ పార్టీకి నానా ఇబ్బందులు మొదలయ్యాయి అనేది వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత నాలుగు జిల్లా పరిషత్ స్థానాలను కూడా కైవసం చేసుకోలేకపోయింది బిజెపి. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 4 స్థానాలను కూడా కైవసం చేసుకోలేక ఇబ్బంది పడింది. దీనితో బిజెపి రాష్ట్ర నాయకత్వానికి నూతన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నుంచి కాస్త పిలుపు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న బిజెపి ఎంపీలతో నడ్డా సమావేశమయ్యారు. 

అలాగే రాష్ట్ర పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాళ్ళు కొన్ని సంచలన విషయాలను చెప్పినట్టు సమాచారం. తెలంగాణాలో కెసిఆర్ అనేది ఒక సెంటిమెంట్ అని చెప్పారట. అక్కడ ఏ విధమైన రాజకీయం చేసినా కెసిఆర్ ని టార్గెట్ చేసారనే విషయం అక్కడి ప్రజలు గమనిస్తారని చెప్పారట. కాబట్టి తెరాస తో పొత్తు పెట్టుకోవడం మినహా మరొక ప్రయోజనం అనేది ఏమీ లేదని, కాబట్టి సొంతగా బలపడాలని నాలుగు ఎంపీ స్థానాలను అడ్డం పెట్టుకుని ముందుకి వెళ్తే అది కెసిఆర్ కి ప్రయోజనం గాని మనకు కాదనే విషయాన్ని చెప్పారట రాష్ట్ర పార్టీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: