ఆంధ్రప్రదేశ్ లో మహిళా భద్రతే లక్ష్యంగా తీసుకొచ్చిన చట్టం దిశా. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన దిశా ఘటన మళ్ళీ జరగకూడదు అని భావించిన జగన్ ఆ విధంగా అడుగులు వేస్తూ రోజుల వ్యవధిలో ఈ చట్టాన్ని కేబినేట్ లో ఆమోదించడం, ఆ తర్వాత దాన్ని శాసన సభలో ప్రవేశపెట్టడం, కేంద్రానికి పంపడం వంటివి దూకుడుగా జరుగుతూ వస్తున్నాయి. ఇక దిశా పోలీస్ స్టేషన్ ని కూడా జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ని ప్రారంభించడమే కాకుండా అందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. 

ఇక దాని కోసం ప్రత్యేక నిధులు, ఒక యాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సక్సెస్ ఫుల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. కేవలం 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏలూరులో చార్జ్ షీట్ దాఖలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. ఇప్పుడు ఇదే జగన్ ని జాతీయ స్థాయిలో హీరోని చేసింది అంటున్నారు పలువురు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులు కొందరు, విజయసాయి రెడ్డి సహా, మిథున్ రెడ్డిని దీని గురించి అడిగారట. అసలు ఆ ప్లాన్ ఏ విధంగా చేసారని. 

దానికి సంబంధించి మీరు తీసుకున్న మార్గదర్శకాలు ఏంటీ...? దాని అమలు ఏ విధంగా జరుగుతుంది...? అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ...? 24 గంటల్లో చార్జ్ షీట్ ఏ విధంగా దాఖలు చేసారని ఆరా తీసారట. ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరిగే, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఇదే విషమై వైసీపీ ఎంపీలను కలిసినట్టు సమాచారం. రాజకీయంగా దాని వలన మైలేజ్ రావడమే కాకుండా మహిళల భద్రత కూడా పెరుగుతుందని ఎంపీలు భావించినట్టు తెలుస్తుంది. అందుకే దిశా చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా ఆమోదించాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: