రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో మీడియా తీరు మరీ తీసికట్టుగా తయారవుతోంది. ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూల మీడియా అయితే మరీ ఘోరంగా లేనిపోని విషయాలను ఏదో సెటైరికల్ దృష్టిలో రాస్తున్నట్లు ఊహించుకొని తమ క్రియేటివిటీని మొత్తం జనాలపై అబద్ధాలను రుద్దడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అది మీడియానో మరియు పేపరో మీకు అర్థమయ్యే ఉంటుంది.

 

మొన్న జగన్ మోడీ తో భేటీ అయిన తర్వాత ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు చివాట్లు పెట్టినట్టు.... తీవ్రమైన ఆగ్రహాన్ని చూపించినట్లు మరియు జగన్ గౌరవంగా చర్చలు మొదలు పెట్టినా అతని మాటలు వినిపించుకోనట్లు బాబోరి మీడియా మరియు పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాశారు. ఇప్పటికే జర్నలిజం మరియు పత్రికలు అంటే సగంమంది జనాలకు చులకన అయిపోయింది. వీరు మరీ ఇంత నిరాధారమైన వార్తలు ఎటువంటి సిగ్గు, బిడియం లేకుండా రాస్తూ ఉంటే ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోతుందని రాజకీయ విశ్లేషకుల మాట.

 

ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మన జ్యోతి పేపర్ అయితే ఏదో వారే మోడీకి మరియు జగన్ కు భేటీ ఏర్పాటు చేసి అక్కడ కెమెరా లేదా వీడియో రికార్డింగ్ పెట్టి మొత్తం విన్నట్లు రాశారు. గతంలో బాబు మోడీకి తిరుపతి శాలువా కప్పి విగ్రహాలు ఇచ్చి కాళ్ళ మీద పడ్డప్పుడు మరియు ప్రత్యేక హోదా విషయమై అడిగినప్పుడు కుదరదు పో..! పోండి అని తరిమివేసినప్పుడు మోడీని విమర్శించి చంద్రబాబు ప్రయత్నాన్ని పొగిడిన అదే పేపర్ వారు కేవలం జగన్ రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చలు చేపట్టిన నేపథ్యంలో ఇటువంటి కుట్రపూరిత వార్తలు రాయడం అటు ప్రజలతో పాటు ఇటు సోషల్ మీడియా వెబ్ సైట్ లను కూడా తీవ్రమైన ఆగ్రహానికి మరియు చిరాకును గురిచేశాయి.

 

అంతా కలిసి ఇప్పుడు జగన్ ఈరోజు అమిత్ షా తో జరగనున్న బేటీ గురించి పేపర్ వారు రేP ఏమి రాస్తారా అని ఎదురుచూస్తున్నారు. మొన్నటిలాగే ఈసారి కూడా అటువంటి అబద్ధపు వార్తలు రాస్తే మాత్రం అంతా కలిసి వారి పని పడతామని రెడీగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: