తెలంగాణ టిఆర్ఎస్ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు యువ నేత  అయిన మంత్రి కేటీఆర్.. తనదైన స్టైల్ లో రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కి మద్దతు ఇచ్చిందని... కానీ అప్పుడు మద్దతు ఇచ్చినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాము  అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ మీడియా ఛానల్ అయిన టైమ్స్ నౌ నిర్వహిస్తున్న సదస్సులో... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... పెద్ద నోట్ల రద్దు అనే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు... తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందని. దీనిపై అసెంబ్లీలో చర్చించి మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు ప్రకటించినట్లు  మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారు అంటూ గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. తాము సంపూర్ణ క్రాంతి వైపు దేశాన్ని తీసుకెళ్తున్న ట్లు ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు అంటూ గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. 

 

 

 కాగా ఆ నాడు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు నమ్మి మద్దతు పలికినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు కు మద్దతు పలికి నందుకు ఇప్పుడు మరో మాటకు తావులేకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత అద్వానంగా తయారయిందన్న కేటీఆర్.... పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపింది అని  తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక అభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడింది అంటూ చెప్పారు. వృద్ధి రేటు నేడు మూడు నాలుగు శాతం మధ్య కొట్టుమిట్టాడుతుండటానికి  కారణం నాడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణమంటూ కేటీఆర్ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: