కొన్ని తేదీలు, కొన్ని సంఘటనలను ప్రపంచం ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుంది.  మానవాళిని నాశనం చేసే కొన్ని అరాచక శక్తులు జరిపిన దాడులు సైతం ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి.  అలాంటి వాటిల్లో ఒకటి ఇండియాలో జరిగిన ఘటన.  ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రతి ఒక్కరు ప్రేమికుల దినోత్సవం గురించి జరుపుకుంటారు.  ప్రేమికులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం దగ్గరి నుంచి అన్నింటిని పంచుకుంటారు.  


ఇలా ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉన్న సమయంలో ఇండియాలో ఓ దుర్ఘటన జరిగింది. 2019, ఫిబ్రవరి 14 వ తేదీన జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో దాదాపుగా 40 మంది ఇండియన్ ఆర్మీ జవానులు మరణించారు.  ఆర్మీ కాన్వాయ్ వెళ్తుండగా, ఈ దాడి జరిగింది.  40 మంది ఆర్మీ జవానులు మరణించడంతో దేశం మొత్తం షాక్ అయ్యింది.  


ఈ షాక్ నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నం చేసింది.  దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ దాడిని ఖండించారు.  ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.  ఇండియన్ ఆర్మీ సైతం తమకు కొంత సమయం ఇవ్వాలని, పాక్ బోర్డర్ లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెడతామని చెప్పింది.  కానీ, ఇండియన్ గవర్నమెంట్ అందుకు అవకాశం ఇవ్వలేదు.  ప్రతీకారం తీర్చుకోవాలి.  కానీ, ఆవేశంతో నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది.  


రెండు రోజులు సైలెంట్ గా ఉన్న ఇండియా, తమ అమ్ములపొదిలో ఉన్న విమానాలను బయటకు తీసి, పాక్ బోర్డర్ లో బాలాకోట్ వద్ద ఉన్న ఉగ్రవాద స్థావరాలను గుర్తించింది.  పక్కా సమాచారంతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.  ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతం అయ్యారు.  కానీ, పాక్ మాత్రం అలాంటిది ఏమి జరగలేదని, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే బాంబులు వేశారని కొన్ని ఫోటోలు పంపింది.  ఇండియా మాత్రం అక్కడ జరిగిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఫోటోలు రిలీజ్ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: