మనిషికి కావాల్సిన ముఖ్య అవసరాలు కూడు, గూడు, గుడ్డ అని అందరికీ తెలుసు. కానీ రోజులు మారుతున్నాయి. కాలం వేగంగా కదులుతుంది. రాతి యుగం నుండి కంప్యూటర్ యుగం వరకు వచ్చేశాం. ఇలాంటి సమయంలో మనిషికి కావాల్సిన ముఖ్య అవసరాల్లో చాలా చేరుకున్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది చదువు. అవును మనిషిని ఇక్కడికి వరకు తీసుకువచ్చిందంటే దానికి ముఖ్య కారణం చదువు.  మనిషికి రేపు ఎలా బ్రతకాలో నేర్పేది చదువు.

 

 

అందుకే ఈ చదువు కోసం ఇప్పటి తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తినడానికి తిండిలేకపోయినా ఫర్వాలేదు కానీ పిల్లవాడికి మంచి చదువు చెప్పించాలని ప్రతీ ఒక్కరూ కొరుకుంటున్నారు. తల్లిదండ్రుల్లో ఉన్న ఈ ఆశనే కొన్ని బడా వ్యాపార సంస్థలు తమ వ్యాపార సామ్రాజ్య విస్తరణకి వాడుకుంటున్నాయి. విద్యని వ్యాపారం చేస్తున్నాయి. మనదేశంలో విద్యపై డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఉంది.

 

 


ఆ నియమాల్ని పక్కన పెట్టి గట్టిగా దండుకుంటున్నారు. సాధారణంగా ఇలా దండుకునే వారిని మన భాషలో ఒక పేరు ఉంటుంది. కానీ అలా చెప్తే వారికి నచ్చదు. అందుకే వారికి వారే ఒక పేరు పెట్టుకున్నారు. అదే కార్పోరేట్. కార్పోరేట్ పేరుతో నాణ్యమైన విద్యని అందిస్తామని చెప్తూ అరకొర వసతులతో ఎటూ పనికిరాని విద్యని విద్యార్థిపై రుద్దుతూ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ఇక నుండి ఈ ఆటలు సాగవట.

 

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పోరేట్ విద్యాసంస్థలపై ఒక కన్ను వేసింది. ఒక విద్యా సంస్థకి ఉండాల్సిన కనీస వసతులు, ఆ విద్యా సంస్థకి ఉండాల్సిన ఫీజులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని పరీక్షించేందుకు ఒక కమిటీని నియమించనుందట. దానివల్ల కార్పోరేట్ విద్యా సంస్థలు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజు వసూలు చేయడానికి ఉండదట. జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో బడా నాయకులు గజగజ వణికిపోతున్నారు. మరి ఈ నిర్ణయం సఫలీకృతం అయ్యి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందితే సంతోషమే కదా...

మరింత సమాచారం తెలుసుకోండి: