తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చుట్టూ ఉంటే పచ్చ కోటరీ మొత్తం తుగులుకుంటుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన ఐటి ఉన్నతాధికారులు ఐదు రోజులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మాజీ పిఎస్ ఇంటిపై ఐటి దాడులనగానే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 

దాడులే సంచలనమంటే ఓ మూడు రోజుల తర్వాత ఐటి శాఖ అధికారికంగా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ మరింత సంచలనంగా   మారింది.  లెక్కల్లో చూపని సుమారు రూ. 2 వేల కోట్ల లావాదేవీలను గుర్తించినట్లు రిలీజ్ లో చెప్పటంతో పెద్ద కలకలం మొదలైంది. బోగస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, దొంగ ఇన్వాయిస్ లు, దొంగ బిల్లులు విదేశాలతో డబ్బు లావాదేవీలు ఇలా చాలానే చెప్పింది ఐటి శాఖ.

 

నిజానికి శ్రీనివాస్ అనే వ్యక్తిది  చంద్రబాబు యంత్రాంగంలో చాలా చిన్నపాత్రనే చెప్పాలి.  ఇప్పటికే సుజనా చౌదరి, సిఎం రమేష్ తో పాటు  అనేకమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలపై పెద్ద ఎత్తున అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణలున్నాయి. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కూడా ఇందులో భాగమనే చెప్పాలి. శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీలు, డాక్యుమెంట్లలో  ఎవరెవరి పేర్లున్నాయో ఎవరికీ స్పష్టంగా తెలీదు.

 

ఐటి శాఖ పేర్లను కూడా బయటపెడితే అది దేశంలోనే  పెద్ద సంచలనమవుతుందనటంలో సందేహమే లేదు. రూ 2 వేలకోట్ల లావాదేవీలన్నది ప్రాధమిక అంచనా మాత్రమే. తవ్వే కొద్దీ ఇంకెన్ని వేలకోట్ల రూపాయల లావాదేవీలు బయటపడతాయో చూడాల్సిందే.  చూస్తుంటే చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీ మొత్తం తగులుకునేట్లే అనిపిస్తోంది. నిజంగా అదే గనుక జరిగితే ప్రముఖులుగా చెలామణి అవుతున్న చాలామంది రాజకీయ జీవితాలు తల్లకిందులైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం చంద్రబాబు చాణుక్యం ఎంత వరకూ పనిచేస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: