ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి కరోనా  వైరస్. చైనాలో గుర్తించబడిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. చైనాలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణభయంతో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వైరస్కు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో... వైరస్ సోకితే చనిపోవడం తధ్యంగా  మారిపోయింది. ఇకపోతే ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులు అందరూ ఈ వైరస్కు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇకపోతే ఈ వైరస్ ని తమ దేశ పరిధిలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. 

 

 

 కాగా  ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ భారతదేశంలోకి విస్తరించిన విషయం తెలిసిందే. కేరళ లో  మూడు కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా  ఈ వైరస్ సోకినట్లు అనుమానితులు ఎక్కువ అవుతున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా కొలకత్తా లో కూడా మరో ముగ్గురికి కరోనా  వైరస్ సోకింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ విస్తరణ గురించి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ క్లారిటీ ఇచ్చింది. భారత దేశంలో ఇప్పటి వరకు 15991 మందికి వైద్య పరీక్షలు జరిపామని తెలిపిన కేంద్రం 1071 మంది టేస్ట్ లు  చేసామని తెలిపింది. ఇంతమందిలో ముగ్గురికి మాత్రమే కరోనా వైరస్ సోకింది అని నిర్ధారణ అయ్యింది అంటూ క్లారిటీ ఇచ్చింది. కరోనా  వైరస్ సోకిన ఆ ముగ్గురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారేనని వాళ్ళంతా చైనాలోని  వుహాన్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. 

 

 

 ఈ ప్రాణాంతకమైన వైరస్ గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దు అంటూ సూచించింది. ఈ కరోనా  వైరస్ ను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ వైరస్ భారత్లో విస్తరించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని... ఈ వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు రకరకాల అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు. కరోనా  వైరస్ వచ్చిందని ఎంతోమందిని అబ్జర్వేషన్లో ఉంచామని కానీ రాలేదు అని తెలిసి వారిని వదిలేసాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోల్కతాలో కూడా కరోనా వైరస్ మరో ముగ్గురికి సోకింది అంటూ వస్తున్న వార్తలను ఖండించింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: