బాస్ దగ్గర పనిచేసిన ఓ పిఎస్ దగ్గరే రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలకు ఆధారాలు దొరికాయా ? అదే మరి బాస్ ను కూడా పట్టుకుంటే ? ఇంకెన్ని వేలు లేదా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలకు ఆధారాలు దొరుకుతాయో కదా ?  ఇపుడిదే అంశంపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున  చర్చ పెరిగిపోతోంది.  మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి అధికారులు  దాడులు చేయటమే సంచలనమం రేపింది. అందులోనూ దాడులు కూడా ఏకంగా ఐదురోజులు జరగటం మరింతగా సంచలనమైంది.

 

ఈ విషయాలు ఇలాగుంటే గురువారం రాత్రి ఐటి అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ తో ఒక్కసారిగా కలకలం మొదలైంది. శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో ప్రాధమికంగా  రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు గుర్తించినట్లు చెప్పటంతో రాజకీయంగా సంచలనం మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు యంత్రాంగంలో మాజీ పిఎస్ శ్రీనివాస్ అనే వ్యక్తి పాత్ర  చాలా చిన్నది.

 

మాజీ పిఎస్ దగ్గరే వేల కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తిస్తే  సోదాలను లేకపోతే విచారణను మరింత లోతుగా చేస్తే ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో ? చంద్రబాబుకు బినామీలుగా ప్రచారంలో ఉన్న సుజనా చౌదరి, సిఎం రమేష్ తో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణతో పాటు కొందరు ఎంఎల్ఏలు కూడా ఆకాశమే హద్దుగా అవినీతితో చెలరేగిపోయారనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి.  

 

మొత్తం మీద శ్రీనివాస్ ను ఐటి అధికారులు విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలుగుదేశంపార్టీ భవిష్యత్తు ఇక్కడితో ఖతమనే ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది. చంద్రబాబు రాజకీయజీవితమే కాదు పుత్రరత్నం నారా లోకేష్ తో పాటు ఎంతోమంది రాజకీయజీవితాని దాదాపు ముగింపు కార్డు పడే ప్రమాదం పడిపోయిందని టిడిపి నేతల్లోనే ఆందోళన పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: