2012 సంవత్సరంలో 23 ఏళ్ళ  నిర్భయపై అతి దారుణంగా అత్యాచారం ఘటన లోని దోషులకు ఇంకా శిక్ష పడలేదు. ఈ ఘటనలోని దోషులను శిక్షించేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చినప్పటికీ నిందితులకు శిక్ష వాయిదా పడుతూ వస్తోంది. జనవరి 22... ఫిబ్రవరి 1... ఇలా నిర్భయ కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. అయితే నిర్భయ కేసులో నిందితులకు ఇంకా ఉరిశిక్ష అమలు కాకపోవడంతో ఈ దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ...చట్టం  ముందు అందరూ సమానం అనే ఉద్దేశంతో రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు అందరూ రోజుకో ఎత్తుగడతో ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తూ శిక్ష  నుంచి తప్పించుకున్నారు. దీంతో కోర్టులు  శిక్షలు విధించినప్పుడు కీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 

 

 

 నిర్భయ కేసులో ని నలుగురు నిందితులను ఉరి తీసేందుకు తేదీ ఖరారు అయినప్పటికి నిర్ణయ కేసులో నిందితులు చట్టపరంగా వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ వస్తున్నారు. పైస్థాయి కోర్టులో పిటిషన్ వేయడం... రాష్ట్రపతి క్షమాభిక్ష ను కోరడం లాంటివి చేస్తున్నారు. ఇక తాజాగా నిర్భయ కేసులో ని నిందితుడైన వినయ్ శర్మ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. తనను  తీహార్ జైల్లో చిత్రహింసలకు గురిచేశారని ఆ కారణంగా నాకు పిచ్చెక్కిందని...  మానసిక సమస్యతో బాధపడుతున్నాను అంటూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 

 

 అంతేకాకుండా రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చడాన్ని  అతను సవాల్ చేశాడు. తన మానసిక వ్యాధిని దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పరిగణలోకి తీసుకోలేదు అంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నాడు నిందితుడు వినయ్ శర్మ. మరోవైపు పిటిషనర్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి మానసిక సమస్యలు లేవని కేంద్రం కోర్టుకు తెలియజేసింది కాగా పిటిషన్ స్వీకరించి విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించనుంది. కాగా సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: