ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల సమస్య రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. అటు అమరావతి కోసం భూములిచ్చిన రైతులు రోజూ తమ గొంతుని ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశంతో సహా మిగిలిన పార్టీలు కూడా అమరావతి రైతుల ఆందోళనలకి మద్దతు తెలుపుతున్నారు. అయితే జగన్ విధానంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

 

 

జగన్ తన విధానాన్ని అమలు చేసి ఎలాగైనా మూడు రాజధానులని పెట్టాలనే భావిస్తున్నాడు. ఈ విషయంలో జగన్ ఎంత పట్టుదలగా కనిపిస్తున్నాడో మిగతా పార్టిలు..ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంతే పట్టుదలగా పెట్టనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీరిద్దరి మధ్య ఈ విషయంలో ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. మొదటగా మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టినపుడు శాసన మండలి సెలెక్షన్ కమిటీకి అప్పగించింది.

 

 

దీన్ని తిప్పికొట్టేందుకు సెలెక్ట్ కమిటీ అనుకున్న సమయంలో జరగలేదు కాబట్టి.. ఆ ప్రొసీజర్ సరిగ్గా లేనందున సెలెక్ట్ కమిటీ ప్రపోజల్ కరెక్ట్ కాదని ఒకవైపు, మరో పక్కసెలెక్ట్ కమిటీ పద్నాలుగు రోజుల్లో వేయాల్సింది కాబట్టి..ఆ పద్నాలుగు రోజుల్లోపు అధికార పక్షం వేయకుండా చేసి..ఇప్పుడు మీరు వేసిన కమిటీ చెల్లుబాటు కాదంటు కార్యదర్శి ద్వారా లెటర్ పంపించింది ప్రభుత్వం... అదే జరిగితే కార్యదర్శినే అరెస్ట్ చేయిస్తాం అని తెలుగుదేశం ముందుకు వచ్చింది.

 

 


దీన్ని తిప్పి కొట్టడానికి గవర్నర్ చేత శాసనసభని, శాసన మండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇప్పించింది జగన్ ప్రభుత్వం. ప్రోరోగ్ అంటే ఈ రెండు సభలని నిరవధిక వాయిదా వేయడం. మళ్ళీ మీటింగ్ జరగాలంటే కేబినేట్ మీటింగ్ జరగాలి. నిరవధిక వాయిదా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న బిల్లులకి సంబంధించిన ఆర్డినెన్సులని జారీచేయవచ్చు. ఈ ఆర్డినెన్సులను ఆటోమేటిక్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గవర్నర్ వీటిని తిప్పి పంపుతాడు. అయితే ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో జగన్ ఆర్డినెన్సులు ఇచ్చేలాగే కనిపిస్తున్నాడు. ఈ విధంగా జగన్ తెలుగుదేశానికి పై ఎత్తు వేయాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: