దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఫలితాల్లో  జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు సత్తా చాట లేకపోయాయి. సామాన్యుడి పార్టీ వైపు బిజెపి కాంగ్రెస్ పార్టీలు సత్తా చాటలేక  చతికిలబడి పోయాయి. సామాన్యుడి పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఇది ఒక్కసారి అనుకుంటే పొరపాటే... గత మూడు ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ  పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు ఎదిరించలేక పోతున్నాయి. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది  బిజెపి 8 స్థానాల్లో విజయం సాధించింది.  ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. ఒకప్పుడు ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏకచక్రధిపత్యం కొనసాగిస్తూ... దశాబ్దాల పాటు  దేశాన్ని ఏలిన పార్టీకి ప్రస్తుతం తీవ్ర దుస్థితి వచ్చింది అనే చెప్పాలి. 

 

 

 ఎన్నికలు కనీసం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేక  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ కనుమరుగవుతుంది అనే స్థితికి చేరుకుంది.  ఇకపోతే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ల తాకాయి అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మైనార్టీ మతవాదం పై కాంగ్రెస్ సామరస్య ధోరణితో ఉంటుందని ప్రచారం చేయడంతో తప్పు జరిగింది అంటూ తెలిపారు. 

 

 

 షహీన్ బాగ్ పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాలను బిజెపి పార్టీ ప్రచార అస్త్రాలుగా మార్చుకొని ప్రచారం నిర్వహించింది... అయితే బిజెపి పార్టీ తమదైనా వ్యూహాలతో ప్రచార నిర్వహించినప్పటికీ ఓట్లను చీల్చిందే  తప్ప గెలవలేక పోయింది అంటూ ఆయన వాక్యనించారు . అయితే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పార్టీ కంటే అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకేనని ఆయన తెలిపారు. ఒక్కసారిగా కరోనా  సోకితే ఎంత నష్టం జరుగుతుందో  అంత నష్టం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జరిగింది అని తెలిపారు. మైనారిటీ ప్రజల మనోభావాల పట్ల కొందరు సీనియర్లు సున్నితంగా వ్యవహరించాలని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన  జైరాం రమేష్... దీంతో తాము మతవాదం పై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నామని  దుష్ప్రచారం జరిగిందని... ఇందువల్లే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో నష్టం జరిగింది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: