ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను.. అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. త‌మ ప్ర‌భుత్వంలో అవినీతి, అడ్డగోలు అక్రమాలకు తావు లేదని స్ప‌ష్టంచేశారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అంద‌జేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పట్టాల పంపిణీకి సంబంధిత అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది నాటికి.. మాట ఇచ్చినట్టుగా అందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. వాటిని లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తోంది.

 

25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు అంటే సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అందులో ఉన్న సిబ్బంది సరిపోరు. అందుకే.. ఈ ప్రక్రియలో రెవిన్యూ వ్యవస్థలో కీలకమైన తహసీల్దార్ లను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ నిమిత్తం.. వారిని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు.. తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 

ఏపీలో ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ.  ఏపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తుర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: