ప్రేమ అమృతాన్ని పంచుతుంది అంటారు కాని కొందరి జీవితాల్ని చీకటి మయం కూడా చేస్తుంది. అని ఇక్కడ జరిగిన ఘటన నిరూపిస్తుంది. ఇకపోతే ప్రేమే జీవితం కాదని ఎందరో అంటుంటారు కాని ఆచరణకు వచ్చే సరికి ప్రేమే జీవితం అని భావిస్తారు. ఇలా భావించిన యువతి యువకులు అర్దాంతరంగా ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు.. ఏమండి యువతి యువకుల్లారా ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి...

 

 

తొమ్మిది నెలలు మిమ్మల్ని కడుపులో మోసిన అమ్మ ముందు ఏ ప్రేమ గొప్పది, 25 సంవత్సరాలు తన గుండెల మీద మోసే తండ్రి ప్రేమ ముందు ఏ ప్రేమ గొప్పది. అమ్మాయి ప్రేమ గొప్పది కాదని ఇక్కడ చెప్పడం లేదు. ఎంతకాలం మీ జీవితంలో ఉంటుందో తెలియని అమ్మాయి ప్రేమకోసం, మీరే జీవితం అనుకునే తల్లిదండ్రుల ప్రేమను కాదనుకుంటున్నారే మీరు గొప్పవారా.. అవి వేకులా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.. ఎందుకంటే మీకు ప్రేయసి దూరమైతే ఎంతమంది ప్రేయసిలను అయినా పొందవచ్చూ, అదే అమ్మనాన్నలకు మీరు దూరమైతే మీలాంటి వారిని, వారి జీవితంలో మళ్లీ పొందగలరా ఒక్క సారి ఆలోచించండి..

 

 

ఇలా కన్న తల్లిదండ్రులను క్షోభపెట్టి కేవలం కొద్దిరోజుల ప్రేమకోసం నూరేళ్ల భవిష్యత్తును అనాలోచితంగా మట్టిపాలు చేస్తున్నారు... ఇది భావ్యమా ఒక్క సారి ఆలోచించండి.. ఇక ఇలాంటి తొందరపాటే ఓ యువకుడు చేసాడు. 25 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమను ఒక్క క్షణంలో కాలరాసాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే... షాద్‌నగర్‌ సమీపంలోని ఓ కంపెనీలో పని చేస్తున్న, కొందుర్గు మండలానికి చెందిన విజయ్‌ (25) అనే యువకుడు  స్థానికంగా ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలియడంతో యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి కుదిర్చారు.

 

 

తన ప్రియురాలుకు వేరే వ్యక్తితో వివాహం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న విజయ్‌, కన్న వారికి కంపెనీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు.. ఇక ఎంత రాత్రి అయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా అతని ఆచూకి తెలియకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని ఆ మృతదేహం జేబులను పరిశీలించగా అతని ఆధార్‌ కార్డు దొరికింది.. దీని ఆధారంగా అతన్ని విజయ్‌గా గుర్తించి, వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు.

 

 

కాగా, గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి, పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు, ప్రాథమి విచారణలో పోలీసులు నిర్ధారించారు. ఇకపోతే ప్రేమ విఫలం కావడంతోనే విజయ్‌ గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడని, కాని ఇలాంటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లిదండ్రులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు... చూసారా చావడానికి చేసే ధైర్యంలో పావు వంతైనా బ్రతకడానికి ప్రయత్నిస్తే, ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలేది కాదు కదా.. !

మరింత సమాచారం తెలుసుకోండి: