ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు ఆశించే చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై అటు జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూడా సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభ పదవి పొందే అవకాశం ధరి చేరుతున్నట్లు అర్థమవుతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాజ్యసభ సభ్యులైన కే.కేశవరావు,  మహమ్మద్ అలీ ఖాన్,  టి సుబ్బిరామి రెడ్డి, సీతామాలక్ష్మి రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకోనుంది.

 


 అయితే భవిష్యత్తు రాజకీయాలు సామాజిక పరంగా అన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఒక రాజ్యసభ సీట్లు ఇవ్వాలనే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయాలు దృశ్య ఈ మేరకు మెగాస్టార్ రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఏపీలో త్వరలో ఖాళీ కానున్న ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు... ఎవరికి కేటాయించాలి అనే దానిపై జగన్ సర్కారు సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన నేత కాకపోయినా చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 


 ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీని ఎదిరించేందుకు జనసేన బిజెపితో జత కట్టింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే వద్దునే ఉద్దేశంతో చిరంజీవికి రాజ్యసభ సీటును కేటాయించాలని యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఉన్నారు. ఎంతో  పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించారు. ఈ నేపథ్యంలో కళాకారుల జాబితాలో  చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనే యోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవిని కళాకారుల జాబితా లో రాజ్యసభ సీట్లు కేటాయించి రాజ్యసభకు పంపితే ఎలాంటి విమర్శలకు కూడా తావుండదు అని వైసీపీ పార్టీ యోచిస్తోందట. అంతే కాదు చిరంజీవిని మచ్చిక చేసుకోవడం వల్ల అటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు తప్పుతాయి అని  వైసిపి పార్టీ భావిస్తోందట. మరి భవిష్యత్తులో వైసిపి పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నది  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: