మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామపు కోరల్లో  ఆడపిల్లలు చిక్కుకుంటూనే ఉన్నారు. బయట తిరిగే ఆకతాయిల నుంచి ప్రమాదం ఉందని ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న సొంత వారి నుంచే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి నేటి రోజుల్లో. కంటికి రెప్పలా కాపాడి ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన నాన్నే కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉండాల్సిన అన్న... కామపిశాచి లా మారి మీద పడిపోతున్నాడు. ఇలాంటి సభ్య సమాజం తలదించుకునే ఘటనలు నేటి రోజుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి ఘటనలతో సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. 

 

 వావివరుసలు మరచి సొంత వారిపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్లు. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ఓ అన్న చెల్లెలిపై అత్యాచారం చేశాడు. అతడు అత్యాచారం చేయడమే కాదు స్నేహితుడుని  కూడా అత్యాచారానికి ఉసిగొల్పాడు  దీంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక పోయిన బాలిక పురుగుల మందు తాగి తనువు చాలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరికి వెళ్ళిన తల్లిదండ్రులు తన కూతురిని సొంత అన్నకు అప్పజెప్పి జాగ్రత్త అని చెప్పి వెళ్లారు. సొంత అన్న దగ్గర కంటే ఇంకెవరి దగ్గర భద్రంగా ఉంటుంది అని అనుకున్నారు. 

 


 కానీ ఇక్కడ సొంత అన్నయ్య కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కలిసి ఇంట్లోనే ఫుల్లుగా మద్యం సేవించిన యువకుడు. తర్వాత కామంతో ఊగిపోయి సొంత చెల్లి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను అత్యాచారం చేయడమే కాదు తన స్నేహితున్ని  కూడా చెల్లిపై  అత్యాచారం చేయడానికి ఉసిగొల్పాడు. దీంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక పోయిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఇక  ఊరు నుండి  ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు విగతజీవిగా కనిపించింది. అయితే ఇంకొన్ని రోజుల్లో 18 ఏళ్ళు నిండుతాయి అని పెళ్లి చేద్దామని అనుకుంటున్న సమయంలో ఇలాంటి దారుణం జరిగింది అంటూ బోరున విలపించారు తల్లిదండ్రులు. సొంత అన్న ఇలా చేస్తాడని అనుకోలేదు  అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: