మన చేతికున్న వేళ్లు ఒక తీరుగా లేవు.. అలాగే ఒకే ఇంటిలో ఒకే కడుపులో పుట్టిన ఇద్దరి మనషుల మనస్తత్వాలు ఒకే ఆలోచనలతో ఉండవు. అలాంటిది లోకంలో పుట్టిన ఏందరో మనషుల ఆలోచనలు, ప్రవర్తన సవ్యంగా ఉండాలను కోవడం పొరపాటే..  ఎందుకంటే అందరు మానవ రూపంతో ఈ భూమి మీద జీవిస్తున్న, వారి ఆలోచనలు  వేరు వేరుగా ఉంటాయి. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఒక వ్యక్తి దొంగలా కనిపిస్తాడు. కానీ దొంగ కాదు, చిలిపిగా కనిపిస్తాడు కానీ చిలిపి వ్యక్తి కాదో, అవునో తెలియదుగానీ ఆ అర్ధరాత్రి అతను చేసిన పని మాత్రం వింతగా, చిలిపిగా అనిపిస్తుంది..

 

 

ఇతన్ని చూస్తే మనుషుల మనస్తత్వం ఇంత భిన్నంగా ఉంటుందా అని ఆలోచిస్తారు.. ఇతను చేసిన పని వల్ల ఎవరికి నష్టం లేదు కానీ, అతని చిలిపి పని తన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.. ఒక రకంగా ఆలోచింపచేస్తుంది. ఇకపోతే ఓ రాత్రి సమయాన పెద్దమనిషిలా హుందాగా నడుచుకుంటు ఓ వ్యక్తి అలా రోడ్డుపైకి వచ్చాడు. చూపులకు మాత్రం జెంటిల్ మ్యాన్‌లా ఉన్నాడు, అలా నడుస్తున్న వ్యక్తి ఒక బైక్ పక్కనుండి ముందుకు వెళ్లుతూ, సడెన్‌గా వెనక్కి తిరిగాడు...

 

 

అతను బైక్ దొంగతనానికి వచ్చాడనుకుంటే పొరపాటే. అ బైక్ పక్కనే గోడమీద ఉన్న సినిమా పోస్టర్లోని ముద్దుగుమ్మల మీద మనసు పారేసుకున్నాడు కావచ్చూ, అందుకే ఆ పోస్టర్ వైపు వచ్చి, వాటికి మరింత దగ్గరగా జరుగుతూ, తనను ఎవరైనా చూస్తున్నారా అని చుట్టుపక్కల పరిసరాలను గమనించి, ఎవరూ చూడటం లేదని తన పని కానిచ్చుకున్నాడు.

 

 

ఏం పని అనుకుంటున్నారు.. ఆ పోస్టర్లో ఉన్న అమ్మాయిల పెదవుల్ని తనివితీరా ముద్దాడుతూ మురిసి పోయాడు ఈ ఘనుడు.. అలా మార్చి, మార్చి తన పనికానిచ్చుకుని, ఇక చాలు అనుకుని ఎంతో ఠీవిగా అక్కడినుండి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. ఈ చిలిపి పని అక్కడున్న సీసీ కెమరాలో రికార్డ్ అవగా ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది... మీరు చూసి కాస్త నవ్వుకోండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: