అమెరికా...  ఇరాన్  దేశాల  గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  ఇరాక్ లో సులిమానిపై దాడి జరిగిన తరువాత రెండు దేశాల మధ్య రగడ మొదలైంది.  ఈ రగడ  ఇలా కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు మరలా రెండు దేశాల మద్య మరోసారి యుద్ద భయం నెలకొన్నది.  గురువారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకు పడింది.  ఈ దాడిలో ఎవరు మరణించారు అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నది.  


డిసెంబర్ 27 వ తేదీన ఇరాక్ లో ఇరాన్ ఆర్మీ కమాండర్ సులేమాని పై దాడులు చేసి అమెరికా సైన్యం హతమార్చింది.  ఆ తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.  కొన్ని రోజుల కిందట ఇరాక్ ఆర్మీ క్షిపణి దాడులు చేసి అమెరికా బేస్ పై విరుచుకుపడింది.  ఈ దాడిలో 80 మంది వరకు అమెరికా సైన్యం మరణించినట్టు చెప్తున్నా, ఒక్కరు కూడా మరణించలేదని అమెరికా చెప్పింది.  


ఇవన్నీ వేరే విషయాలు అనుకోండి.  ఇప్పుడు మరోసారి ఇరాన్ సైన్యం అమెరికా బేస్ పై బాంబు దాడులు చేయడంతో అక్కడ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారిపోయాయి.  ఎప్పుడు ఎటునుంచి ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.  ఇప్పటికే అనేక రకాలుగా ఇరాక్ నష్టపోయింది.  ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మరలా యుద్దం లాంటిది ఏదైనా జరిగితే ఫలితం తీవ్రంగా ఉండవచ్చని అంటున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది.  


కానీ, ఇరాన్ మాత్రం వదిలేది లేదని అంటోంది.  ఎలాగైనా సరే అమెరికాను ఎదుర్కొని తీరుతామని, తమకు చేసిన ద్రోహానికి సమాధానం చెప్పి తీరతమని అంటోంది ఇరాన్.  గల్ఫ్ లో ఈ సమయంలో యుద్దం అంటూ వస్తే  దాని వలన గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయి.  అసలే ఇప్పుడు ఆర్ధికమాంద్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది.  ఈ సమయంలో ఇది మంచిది కాదు అన్నది కొందరి వాదన.  చూద్దాం ఏమవుతుందో.  ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.  

మరింత సమాచారం తెలుసుకోండి: