ఆంధ్రప్రదేశ్ లో ఐటి దాడుల హడావుడి నెలకొంది. ఐటి అధికారులు ఇటీవల టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు చేసిన నేపధ్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆసక్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది.

 

రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న నారా సామ్రాజ్యంలో ఒక్కసారిగా కుదుపు మొదలయింది. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళడం కూడా ఇప్పుడు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

 

వాస్తవానికి చంద్రబాబు మాజీ పిఏ శ్రీనివాస్ పై జరిగిన ఐటి దాడులతో టీడీపీ అగ్రనేతల్లో భయం నెలకొంది. ఇన్నాళ్ళు తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని భావించిన చంద్రబాబు సన్నిహిత నేతలు ఇప్పుడు ఒక్కసారిగా కంగారు పడే పరిస్థితి వచ్చింది. ఇక శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలను అధికారులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అటు చంద్రబాబు అనుకూల మీడియా కూడా దీనిపై కథనాలు ప్రసారం చేసింది. దీనితో దొరికిన పత్రాలు ఏంటీ అనేది అని  ఎవరికి స్పష్టత రావడం లేదు. 

 

ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి మీద, కరకట్ట మీద చంద్రబాబు ఇంట్లో, అలాగే ట్రస్ట్ భవన్ లో కూడా ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం సీరియస్ గా ఉందని, అందుకే జగన్ ఢిల్లీ వెళ్ళారని, ఇందుకోసం ఏసీబీ సహకారం కూడా ఐటి అధికారులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని  అని  అంటున్నారు.

 

త్వరలోనే ఈ దాడులు జరుగుతాయని అంటున్నారు, మార్చ్ మొదటి వారంలో జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. శ్రీనివాస్ ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: