ఎప్పుడో ఎవరో ఆడవారి రుతుస్రావం గురించి ఏదో తప్పుడు ప్రచారం చేస్తే.. వాటిని ఈ 21వ శతాబ్దంలో కూడా కొంతమంది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. విషాదకరమైన విషయం ఏంటంటే... మూఢనమ్మకాలను పోగొట్టి అసలైన జ్ఞానం అందించే పాఠశాలలో, కాలేజీలలో కూడా ఈ మూఢనమ్మకాలను పాటించి అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని ఒక డిగ్రీ హాస్టల్ లో విద్యార్థినులకు జరిగిన ఒక సంఘటన అందరి ఆగ్రహానికి కారణమవుతుంది.


అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం... గుజరాత్ రాష్ట్రం భుజ్ లోని శ్రీ సహజనంద్ బాలికల సంస్థ యొక్క వసతి గృహంలో 68మంది డిగ్రీ విద్యార్థినిలు చదువుకుంటున్నారు. స్వామి నారాయణ మందిర్ శిష్యులు కొందరు ఈ కాలేజీని 2012లో నిర్మించారు. అయితే, 2014లో ఆ కాలేజీలోని విద్యార్థినులందరిని ఖాళీ చేయించి వారిని నారాయణ మందిర్ ప్రాంగణంలో ఉన్న ఒక కొత్త భవనంలోకి తరలించారు. వాస్తవానికి వీరు నడిపించే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులు కొన్ని విశ్వాసాలను, ఆచారాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఎప్పుడైతే వారు మందిర్/గుడి ప్రాంగణంలోని కొత్త భవనంలోకి అడుగు పెట్టారో... ఆ రోజు నుండి ఋతుస్రావం అవుతున్న విద్యార్థినులను గుడి వైపు, కిచెన్ వైపు అస్సలు వెళ్లకూడదని ఆంక్షలు పెట్టారు.


ఇంకో డిస్టర్బ్ంగు రూల్ ఏమిటంటే నెలసరి రోజుల్లో ఉన్న బాలికలు తమ స్నేహితులను కూడా ముట్టుకోకూడదు. ఋతుస్రావం అయిపోయేంత వరకు విడివిడిగా ఉండాలి. ఈ కాలేజీలో చదువుకుంటూ వసతి గృహంలో ఉంటున్న పదిహేను వందల మంది విద్యార్థినులు మారుమూల గ్రామాల నుంచి వచ్చినవారే. అయితే వీళ్లంతా తమ హాస్టల్ రూల్సులను, రుతుస్రావంలో రోజుల్లో పెట్టిన నిబంధనలను సరిగా పాటించడంలేదని ఆ హాస్టల్ రెక్టార్ ప్రిన్సిపాల్ కు గురువారం రోజు ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె... చకచకా ఒక క్లాసురూము వద్దకు వచ్చి నెలసరి రోజుల్లోనూ హాస్టల్లో తిరుగుతున్నది ఎవరో చెప్పండని నిలదీసింది. దీంతో ఆ క్లాసు రూములో ఉన్న విద్యార్థినులంతా ఏమి మాట్లాడకుండా తల దించుకున్నారు. మీరు ఇలా చెప్పారని ఆమె కోప్పడుతూ క్లాసురూమ్ లో ఉన్న వారిని ఎవరిని బయటికి పోనివ్వకుండా కాపలాకాసి ఒక్కొక్కరిని బాత్రూంలోకి పంపించి ఫిమేల్ టీచర్లతో చెక్ చేయించింది. ఆ టీచర్లు ప్రతి విద్యార్థినుల అండర్ వేర్ ను విప్పించి మరీ పీరియడ్స్ లో ఉన్నారో లేదో చెక్ చేసారు.


ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఆ బాలికలు చాలా అవమానంగా భావించారు. కొందరు ధైర్యం చేసి తమని ఇలా అవమానించడం సరికాదని బయటికి వచ్చి మండిపడ్డారు. దీంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది. వెంటనే స్పందించిన పైఅధికారులు ఈ విషయం గనుక నిజమైతే కచ్చితంగా ఆ పని చేసి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిరియడ్స్ రోజుల్లో గుడిలోకి, కిచెన్ లోకి రాకుండా ఉన్న నిబంధనని పక్కన పెడితే స్నేహితులతో కలవకుండా విడిగా ఉండటం అనే ఆంక్ష వెర్రితనమని నెటిజనులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: