ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే సాంగ్ ఉన్నది కదా.  ఆ పాటలో ఇలాంటి సామెత ఒకరు ఉంటుంది.  ఎవరి కోసమో ఎదురుచూస్తూ కూర్చుంటే... పనులు ముందుకు జరగవు.  ఎలాంటి పనులు చేయాలి అనుకున్నా వెంటనే జరిగిపోవాలి.  అప్పుడే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. రాష్ట్రంలో చాలా గ్రామాలకు రోడ్లు లేవు.  ముఖ్యంగా విశాఖ పరిధిలోని గిరిజన గ్రామాలలో రోడ్డు లేదు. దగ్గర లో ఉన్న పట్నం వెళ్ళాలి అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి.  వసతి సౌకర్యాలు ఉండవు.  


ఎవరికైనా ఎలాంటి జబ్బు చేసినా ఆ వ్యక్తి మరణించడం కంటే మరో మార్గం ఉండదు.  అందుకే దాని నుంచి బయటపడేందుకు అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా ఆలోచించారు నలుగురు మొదట ఈ ఆలోచన చేశారు.  ఎన్నో ఏళ్లుగా రోడ్డు వేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి.  కానీ, ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.  విసుగుచెందిన అక్కడి ప్రజలు ఎదో ఒకటి చేయాలనీ అనుకున్నారు.

 

 అనుకున్నట్టుగానే నలుగురు యువకులు కలిసి చుట్టూ పక్కల ఉన్న 9 గ్రామాల్లో ఈ విషయం గురించి చెప్పారు.  
అందరిని ఒప్పించారు.  దాదాపుగా 250 కుటుంబాలు 1500 మంది ప్రజలు కలిసి కొండను తొలిచి రోడ్డు వేయడం మొదలుపెట్టారు.  జనవరి 23 న రోడ్డు నిర్మించే పని మొదలు పెట్టగా, ఇప్పటికి పూర్తయింది.  మూడు వారాల్లోనే రోడ్డు వేసుకున్నారు.  దాదాపు ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. దీంతో ప్రజలు అన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డారు.

 

 గిరిజన గ్రామ ప్రజలు చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి అక్కడ మెటల్ రోడ్ వేస్తామని అంటోంది.  
ఆయా గ్రామాల్లో రోడ్డు వేయడానికి గతంలోనే రూ. 40 లక్షల రూపాయలు గ్రాంట్ ను ప్రభుత్వం రిలీజ్ చేసిన అడుగు కూడా ముందుకు వేయలేదు.  ఇప్పుడు గ్రామస్తులు సొంతంగా రోడ్డు నిర్మించుకున్నాక చలనం వచ్చింది.  మెటల్ రోడ్డు నిర్మాణంలో భాగస్వామ్యం అయితే, ఆ డబ్బును గిరిజనులకే ఇస్తామని అంటున్నారు.  మరి దీనిని గిరిజనులు అంగీకరిస్తారా చూడాలి.  గతంలో బీహార్ లో మాంజీ ఒక్కరే తన భార్య లాంటి పొరపాటు మరొకరికి జరగకూడదు అని చెప్పి ఒంటరిగా కొండను తవ్వి రోడ్డు వేశారు. దానిని సినిమాగా కూడా తీసిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: