రాజధాని వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవాలని భావించిన తెలుగుదేశం పార్టీకి మరోసారి మండలిలో షాక్ తగిలింది. సెలెక్ట్ కమిటీ ఫైల్ ని మండలి కార్యదర్శి రెండో సారి వెనక్కు పంపించారు. దీని ద్వారా సెలెక్ట్ కమిటి ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యదర్శి రెండో సారి చెప్పినట్లు అయింది. దీనితో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. దీనితో ఆయనపై కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్టు సమాచార౦. ఇప్పటికే దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో కూడా ఎమ్మెల్సీలు చర్చించినట్టు తెలుస్తుంది. 

 

రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డియే రద్దు బిల్లులను శాసన సభలో ఆమోదించగా అది మండలిలో ఆగిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య మండలిలో చైర్మన్ షరీఫ్ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మండలిలో టీడీపీ, వైసీపీ, బిజెపి, పీడీఎఫ్ సభ్యుల వివరాలు ఇవ్వాలని చైర్మన్ లేఖలు రాసారు. దీనికి వైసీపీ మినహా అన్ని పార్టీలు తమ సభ్యుల వివరాలను వెల్లడించాయి. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అసలు బిల్లులను ఎందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలి అంటూ అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. 

 

మండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని టీడీపీ అంటుంది. మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు జరిగిందని ప్రభుత్వం కోర్ట్ కి చెప్పిందని టీడీపీ అంటుంది. ఇక ఇదిలా ఉంటే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత బిల్లు ఆమోదం పొందడం, అది కేంద్రం హోం శాఖకు చేరడం జరిగాయి. కాని ఈ విషయంలో మాత్రం కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది స్పష్టత రావడం లేదు, జగన్ ఢిల్లీ వెళ్లి ఇదే విషమై ప్రధాని నరేంద్ర మోడీ తో చర్చించారని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుని ఆమోదించాలని ఆయన కోరారని అంటున్నారు. కార్యదర్శి వ్యవహారంపై టీడీపీ సోమవారం హైకోర్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: