జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆటలో అరటిపండు అయిపోయినట్టుంది. కేవలం జగన్ ని టార్గెట్ చేసి ప్రశ్నిస్తాను అని చెప్పి తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వైసిపి పార్టీని దెబ్బ కొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిలో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆరు నెలలు పార్టీ నడిపిన గాని ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఉన్న జగన్ ని ఆట ఆడుకోవాలి అని భావించిన పవన్ కళ్యాణ్ కి బీజేపీ నుండే షాకింగ్ ఝలక్ లు వరుసగా తగులుతున్నాయి.

 

ఢిల్లీలో బీజేపీ పార్టీ నేతలను కలవడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆ పార్టీకి చెందిన పెద్దలు ఇవ్వలేదు. అంతేకాకుండా కనీసం ఎమ్మెల్యేగా గెలవని పవన్ కళ్యాణ్ ని పెద్దగా కూడా బిజెపి పార్టీ నేతలు పట్టించుకోవడం లేదట. మరో పక్క పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ తో పనిచేయటానికి బిజెపి ఎక్కువగా తొందర పడటంతో జనసేన పార్టీ నేతలకు కూడా బిజెపి అనుసరిస్తున్న వైఖరిపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మరోపక్క రాష్ట్రంలో జగన్‌ పాలన పట్ల బీజేపీ నేతల్లో చాలామంది సంతోషంగా వున్నారనీ, వారెవరికీ వైసీపీతో విభేదాల్లేవనీ, భవిష్యత్తులో రెండు పార్టీలూ కలిసి పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు వైసీపీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గతంలో ఉండటంతో అదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా బలంగా నమ్మకంతో ...పవన్ ని బీజేపీ నేతలు లైట్ తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క వైసీపీలో మరో వర్గం ఎట్టి పరిస్థితుల్లో బిజెపి పార్టీ తో కలిసి పనిచేసే అవకాశం లేదని కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: