చింత చచ్చినా...పులుపు చావలేదు అన్నట్లుగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా, ఇంకా అంతర్గత కుమ్ములాటలు తగ్గించుకోలేదు. అసలు మామూలుగా కృష్ణా జిల్లా టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన, జిల్లాలో చెప్పుకోదగిన సీట్లు వచ్చేవి. అయితే గత ఐదేళ్లు టీడీపీ నేతలతో విసిగిపోయిన ప్రజలు, మొన్న ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ సీట్లు ఇచ్చారు. జిల్లాలోని 16 సీట్లలో 14 చోట్ల వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకున్నారు. టీడీపీ 2 మాత్రమే దక్కాయి.

 

ఇక ఇంత భారీ ఓటమి వచ్చాక కష్టపడి పనిచేసుకుని పార్టీని పైకి తీసుకురావాలా? కానీ గత 8 నెలలుగా టీడీపీ నేతలు ఇలాంటి వ్యవహారం ఏమి చేయకపోగా, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూస్తున్నారు. ఏదైనా పార్టీ మీటింగ్‌లు పెట్టినప్పుడు బాబు ముందర అంతా కలిసికట్టుగా ఉన్నట్లే చూపిస్తూ, బయటకు రాగానే డామినేషన్ మొదలుపెడతారు. ఇలా ఎక్కువగా విజయవాడ నేతల్లో డామినేషన్ బాగా కనిపిస్తుంది. అంతర్గత శతృత్వం మెయిన్‌టైన్ చేసే వాళ్ళలో బుద్దా వెంకన్న-కేశినేని నాని, జలీల్ ఖాన్-నాగుల్ మీరా, బొండా ఉమా-కేశినేని, గద్దె రామ్మోహన్-దేవినేని ఉమా, బోడే ప్రసాద్-రాజేంద్రప్రసాద్‌లు ముందుంటారు.

 

అటు బందరులో బచ్చుల అర్జునుడు-కొల్లు రవీంద్ర, పామర్రులో ఉప్పులేటి కల్పన-వర్ల రామయ్య, పెడనలో కాగిత ఫ్యామిలీ-కొనకళ్ళ ఫ్యామిలీ, తిరువూరులో జవహర్-స్వామీదాస్, నూజివీడులో ముద్దరబోయిన-టీడీపీ కేడర్, కైకలూరులో జయమంగళ-చలమలశెట్టి రామాంజనేయులు ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో చాలా మందికి అంతర్గతంగా పడదు. ముఖ్యంగా దేవినేని ఉమా డామినేషన్ అంటే చాలమందికి నచ్చదు. అసలు అంతర్గత కలహాలు వల్లే దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలాంటి బలమైన నేతలు టీడీపీని వీడారు. వారిని పరోక్షంగా ఇబ్బందులు పెట్టడం వల్లే పార్టీని వదిలేశారు. అయితే ఇంత జరిగిన కూడా కృష్ణా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు. ఇంకా అంతర్గత కుమ్ములాటలు పడుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: