మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కలసి మహారాష్ట్ర వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్‌సీపీ పార్టీ అధక్షుడు శరద్ పవార్‌ను కాదని త‌నతో పాటు వచ్చిన 32 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అజిత్ పవార్  ఏర్పాటు చేయడం, అనంతరం ఆ సర్కారును కూలదోసి ఈ మూడు పార్టీలు సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 


ఈ ఏడాది జనవరి 25న ఎల్గార్ పరిషద్ కేసును ఎన్‌ఐఎకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2018లో నమోదు చేసిన ఈ కేసును ఎన్‌ఐఎకి బదిలీ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై పవార్​ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొల్హాపూర్‌లో మీడియా సమావేశంలో పవార్ శుక్రవారం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్ర వ్యవహారాలలో కేంద్రం చొరబడడం అక్రమమని అన్నారు. కేంద్ర నిర్ణయమే తప్పయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం ఘోర తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల ప్రభుత్వంలో పొరాపొచ్చాలు వచ్చాయా అనే చర్చ తెరమీదకు వస్తోంది.


 
కాగా, మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన మధ్య సిధ్ధాంత పరంగా ఎన్నో తేడాలు, విభేదాలు ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుకోసం శివ‌సేన.. తన హిందుత్వ సిధ్ధాంతాన్ని వదిలి.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో సీఎం ప‌ద‌వి నుంచి ఫ‌డ్న‌వీస్‌ తప్పుకోవడంతో మహారాష్ట్రలో శివసేన -ఎన్సీపీ -కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఫడ్నవీస్‌ వైదొలిగిన కొద్దిగంటల్లోనే సమావేశమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ‘మహా వికాస కూటమి’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రే (59)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: