ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన తొలిరోజుల్లోనే వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధానం ద్వారా గత ప్రభుత్వం దోచి పెట్టిన సొమ్మును కక్కిస్తామన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా కట్టబెట్టిన కాంట్రాక్టుల్ని సమీక్షిస్తామన్నారు. ఆయన అన్నట్టుగానే చేశారు.

 

మొదట్లో ఈ రివర్స్ టెంటరింగ్ పై చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు దుమ్మెత్తిపోశాయి. ఇలాగైతే ప్రాజెక్టులు కట్టలేమని.. కాంట్రాక్టర్లు పారిపోతారని రాశాయి. కానీ..రాను రాను జగన్ ఐడియా రాష్ట్రానికి ఎంత మేలు చేస్తుందో అర్థం అవుతోంది. ఎందుకంటే.. ఒక్క టిట్కో ఇళ్ల విషయంలోనే దాదాపు రూ. 400 కోట్లు ఆదా అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ టిట్కో ఇళ్ల విషయంలో సుమారు 63,744 ఇళ్లులకు రివర్స్‌ టెండరింగ్‌కు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది.

 

ఈ కాంట్రాక్టు విలువ రూ.3,239 కోట్లు అయితే రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తే రూ.392 కోట్లు ఆదా అయ్యాయి. అంటే ఏరకంగా గతంలో ప్రజాధనాన్ని దోచుకున్నారో తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రూ.4,400 కోట్లు విలువైన 70 వేల ఇళ్లకు రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో రూ. 400 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

 

ఇక పోలవరంలో రూ. 800 కోట్లు ఆదా అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం, టిట్కోలో రూ.12 వందలు ఆదా అయ్యాయి. అంటే గత ఐదేళ్లు ఈ డబ్బంతా చంద్రబాబు తనకు నచ్చినవారికి కట్టబెట్టినట్టే కదా. అంటే జగన్ ఐడియా సూపర్ హిట్ అయినట్టేగా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: