రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఐటీ అధికారులు ఇన్ఫ్రా కంపెనీల్లో సోదాలు చేయడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు దగ్గర పని చేసిన మాజీ పీఏ దగ్గర దాదాపు రెండు వేల కోట్లు పట్టుబడినట్లు స్వయంగా ఐటీ అధికారులు ప్రకటించారు. దీంతో వైసీపీ పార్టీకి అండగా ఉండే మీడియా చంద్రబాబు నేరం రుజువై పోయిందని మరికొద్ది రోజుల్లో జైలుకు వెళ్తున్నట్లు కథనాలు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఐటీ అధికారులు ప్రకటించిన దానిలో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు రాలేదు.

 

కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్లో జగన్ పార్టీకి మద్దతుగా ఉండే మీడియా మాత్రం చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ దోషిగా ఇప్పుడే చిత్రీకరించటం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా చంద్రబాబు కి అండగా ఉండే పవన్ కళ్యాణ్ నీ కూడా ఇందులో జాయిన్ చేస్తూ అతను నోరు మెదపాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇదే సమయంలో జగన్ కేసు ని బయటకు తీస్తూ జగన్ సంపాదన తెరిచిన పుస్తకమని కవరింగ్ చేయడం ప్రస్తుతం జరుగుతోంది. ఇదేవిధంగా చంద్రబాబు అనుకూలంగా ఉండే మీడియా మాత్రం పట్టుబడిన రెండు వేల కోట్లు గురించి పెద్దగా ప్రస్తావన తీసుకు రావటం లేదు. కానీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ ని ఉద్దేశించి మాత్రం భయంకరమైన కథనాలు ప్రసారం చేసింది.

 

జగన్ తన కేసులను మాఫీ చేసుకోవడానికి వెళ్లారని రాష్ట్ర ప్రయోజనాలు అంటూ పైకి కటింగ్ కొడుతున్నారు అంటూ టీడీపీ మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా వర్గం జగన్ ఢిల్లీ పర్యటన వ్యతిరేకమైన కథనాలు చేయటం.., మరోపక్క జగన్ కు అనుకూలంగా ఉండే మీడియా 2000 కోట్లకు సంబంధించి చంద్రబాబు ని దోషిగా చూపించే కథనాలు ప్రసారం చేయడంతో వైకాపా టీడీపీ మీడియా దొంగ డ్రామాలు ఆడుతున్నాయని ఏపీ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇంత దారుణమైన బ్రష్టు పట్టి పోయిన మీడియా మరే రాష్ట్రంలో ఉండదని సంచలన కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: